December 23, 2024

సదరన్ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా స్నూకర్ పోటీలు

చెన్నై న్యూస్; చెన్నై జార్జిటౌన్, గిడ్డంగి వీధిలోని 119 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన సదరన్ ఇండియా వైశ్య సంఘం(శివ) ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించిన సిక్స్ రెడ్ స్నూకర్ పోటీలు విజయవంతంగా ముగిశాయి.సంఘం అధ్యక్షుడు డాక్టర్ కనిగెలుపుల శంకరరావు చేతులమీదుగా ఈ నెల 13 న ఆరంభమైన ఈ పోటీలు ఈ నెల 14 వ తేదీ ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి.ఈ ముగింపు వేడుకలకు స్నూకర్ వరల్డ్ ఛాంపియన్ అనుపమ రామచంద్రన్ ,జాతీయ ఛాంపియన్ శ్రుతి లక్ష్మీనారాయణ లు పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందించారు.టోర్నమెంట్ డైరక్టర్ స్టైల్ విజయకుమార్ మాట్లాడుతూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అజంతా శంకర రావు ప్రోత్సహంతో విజయవంతంగా స్నూకర్ పోటీలు జరిగాయని అన్నారు. సంఘం సహకారంతో త్వరలో స్టేట్ లెవల్ టోర్నమెంట్ నిర్వహించనున్నామని అందుకు సంఘ అధ్యక్షుడు అజంతా శంకర రావు,సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్,కోశాధికారి పెసల రమేష్ లు సహకారం ఎంతైనా అవసరం అని కోరారు.ఈ కార్యక్రమంలో టోర్నీ కో-ఆర్డినేటర్ రామ్ నారాయణ, సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు మన్నారు ఉదయ్ కుమార్, కమిటీ సభ్యులు కేకే త్రినాథ్ కుమార్,బిలియడ్స్ మెంబర్ ఇన్ ఛార్జి ఏవి వాసు, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు

About Author