చెన్నై న్యూస్:సమాజ సేవకు అంకితం అవుదామని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్(విసిఐ) పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలజీ నరసింహన్ పిలుపునిచ్చారు.ఈ మేరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V502A రీజన్–2 ఆధ్వర్యంలో భారతీరత్నం పేరిట రీజన్ సదస్సు (రీకాన్)ను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్న లక్ష్మీ బాలాజీ నారాయణన్ జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వాసవీ క్లబ్ ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.ప్రదానంగా పేద ప్రజలు, వృద్దులు, విద్యార్థులు లబ్దిపొందుతున్నారని పేర్కోన్నారు. సమాజ సేవలో ఉన్న ఆత్మసంతృప్తి మరెందులోను దొరకదని వ్యాఖ్యానించారు.వాసవీ క్లబ్ లన్నీ సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.
రీజన్–2 రీజియన్ ఛైర్‌పర్సన్ R V L రత్నకుమార్, డి పి ఓ R. భారతీ ల సారథ్యలో జరిగిన ఈ సదస్సులో ఉత్తమ సేవలను అందిస్తున్న ఆరు వాసవీ క్లబ్‌లకు వివిధ కేటగిరిల్లో అవార్డులను ప్రదానం చేశారు. సదస్సు ఛైర్మెన్ డాక్టర్ జి జే బాలాజీ ప్రసాద్ తోపాటు మాజీ గవర్నర్ సిహెచ్ వెంకటేశ్వర రావు, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ బి.అనంత పద్మనాభన్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో ప్రదానంగా ఆరోగ్యం, రక్తదానం, బాలికలపై లైంగిన వేదింపులు, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఏర్పాటుచేయాలి అంటూ పలు అంశాలపై చేసిన ఫోస్టర్ ప్రజెంటేషన్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సదస్సులో వాసవి క్లబ్ చెన్నై , వాసవి క్లబ్ వనిత గ్రాండ్ చెన్నై , వాసవి క్లబ్ ప్లాటినం సిటీ ఊరపాక్కం, వాసవీ క్లబ్ వనిత ప్లాటినం సిటీ ఊరపాక్కం , వాసవీ క్లబ్ మాంబలం క్లబ్ ల నిర్వాహకులు ,సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో విఎన్ హరినాథ్,బద్రి నారాయణన్, అమరా నారాయణన్, వి.భారతి, mnv రామ్, కె.శ్రీనివాస్, మంజులా శ్రీనివాస్, S. వనిత, డి.సుకుమార్, టి.ఏ .రమేష్ , ఏ .సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
LG Electronics India Recognized as ‘Great Place to Work’ for the Second Consecutive Year
JSW MG Motor India Delivers 101 MG Windsor in a Single Day
Avtar Awards IBM Leader the 2024 Male Ally Legacy Award and Bosch Limited the Social Excellence Award