చెన్నై న్యూస్. సమాజ సేవతోనే ఆత్మసంతృప్తి లభిస్తుందని జీఎమ్మార్ గ్రూప్ డైరెక్టర్ బొమ్మిడాల మణిసంతోష్ అన్నారు. చెన్నై జార్జిటౌన్ లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కన్వెన్షన్ హాలు వేదికగా జూన్ 30 వ తేదీ ఆదివారం తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ
గ్లోబటర్ చెన్నై ఛైర్మెన్ K.K . త్రినాధ్ కుమార్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు వాసవీ సభ, ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ,జీఎమ్మార్ వరలక్ష్మి ఫౌండేషన్ లు సహకారం అందించాయి. జీఎమ్మార్ గిఫ్ట్ హ్యాంపర్స్ ను 1,500 మందికి అతిథులుగా పాల్గొన్న మణిసంతోష్ ,తారణ ల చేతులు మీదుగా పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని గిప్ట్ హ్యాపర్లు అందుకున్న వారందరికీ భోజనం కూడా అందించారు.ఈ
కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ గ్లోబల్ అడ్వైజర్ టి.రాజశేఖర్, శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ , ఇంకా కె.రవికుమార్ ,చీమకుర్తి గోవిందరాజులు, డి.రవిచంద్రన్, రాధాకృష్ణన్ బాలాజీ, బీఎస్ శ్రీధర్, ఎంపీ నరసింహులు, ఇ.శాంతారం తదితరులు పాల్గొన్నారు.
More Stories
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3
பனகல் அரசரின் 96 ஆம் ஆண்டு நினைவு தினம்