December 17, 2024

100 మంది తెలుగు పాస్టర్ లకు జి టి సి ఎం తరపున నిత్యావసర సరుకులు వితరణ

చెన్నై న్యూస్ : గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ (జి టి సి ఎం) ఆధ్వర్యంలో తుఫాను వరదల్లో నష్టపోయిన తెలుగు పాస్టర్ లకు నిత్యావసర సరుకులు సోమవారం పంపిణీ చేశారు.స్థానిక ఐ సి ఎఫ్ గాంధీ నగర్ లోని ఈసీఐ తెలుగు సంఘంలో జి టి సి ఎం అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు , బిషప్ అంగలకుర్తి దేవసహయం అధ్యక్షతన చెన్నై సహా వివిధ ప్రాంతాల్లో తెలుగు క్రైస్తవుల మధ్య సేవలు అందిస్తున్న 100 మందికి నిత్యావసర సరుకులను డిప్యూటీ ఎగిక్యూటివ్ డైరెక్టర్ బెంజమిన్ శామ్యూల్ పంపిణీ చేశారు .సాయం అందుకున్న తెలుగు పాస్టర్ లు జిటిసిఎం నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ టీవీ ప్రసంగీకులు పాస్టర్ జడ వసంత బాబు , బిషప్ ఈఏబెల్ నీలకంటం తదితరులు పాల్గొన్నారు.

About Author