November 15, 2024

2వ ఎస్ ఆర్ ఎం ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన ఇంటర్నేషనల్ మాస్టర్ హరి మాధవన్ ఎన్ .బి.

చెన్నై వడపళని, సెప్టెంబర్ 24, 2023 : 2వ ఎస్ ఆర్ ఎం ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ హరి మాధవన్ ఎన్ .బి. చాంపియన్ గా నిలిచారు
ఎస్ ఆర్ ఎం ఐ ఎస్ టి వడపళనిలో నిర్వహించ బడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చెస్ ఔత్సాహికులు మరియు నిపుణులను ఆకర్షించింది. సెప్టెంబరు 24, 2023న జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 745 మంది ఆటగాళ్లు, అమెరికా, అరబ్ దేశాలనుంచి ఐదు మంది కలుపుకుని మొత్తం 750 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.పలువురు క్రీడాకారులు తమదైన వ్యూహాత్మక ప్రతిభను చాటుకున్నారు. .అంతర్జాతీయ చెస్ మాస్టర్ హరి మాధవన్ ఎన్ బి తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించి ఛాంపియన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.రెండో స్థానంలో అంతర్జాతీయ చెస్ మాస్టర్ నితిన్ నిలిచాడు.2వ ఎస్ ఆర్ ఎం ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఆట యొక్క స్ఫూర్తిని జరుపుకోవడమే కాకుండా, బలీయమైన ప్రత్యర్థులపై తమ సత్తాను పరీక్షించుకోవడానికి ఆటగాళ్లకు వేదికను అందించింది.ఇది చెస్ యొక్క శాశ్వత ప్రజాదరణ , పోటీ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతులు ప్రదానోత్సవంలో ఎస్ ఆర్ ఎం ఐ ఎస్ టి లో యోగ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎం సెంథిల్ కుమార్ తో పాటు డాక్టర్ వి.శశి రేఖ, డాక్టర్ కే ఆర్ అనంత పద్మనాభన్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఛాంపియన్ గా నిలిచిన ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ హరి మాధవన్ ఎన్ బి ని నిర్వాహకులు అభినందనలు తెలియజేసి ట్రోఫీని బహుకరించారు.ఈ పోటీకి మొత్తం బహుమతి రూ.2 లక్షల నగదు, 130 కప్‌లు పిల్లల కోసం ప్రత్యేక బహుమతిగా అందించబడ్డారు.


About Author