November 22, 2024

యువ నర్తకి రేష్మి శుభశ్రీ చిట్టూరి భరతనాట్య అరంగేట్రం

చెన్నై న్యూస్:భరతనాట్యాలయ – చెన్నై ఆధ్వర్యంలో చెన్నై నగరంలో స్థిరపడిన ప్రముఖ తెలుగు కుటుంబానికి చెందిన చిట్టూరి శ్రీధర్, శైలజా రాణి దంపతుల కుమార్తె రేష్మి శుభశ్రీ చిట్టూరి భరతనాట్య ఆరంగేట్రం శుక్రవారం రాత్రి టి.నగర్ వాణి మహల్ లో ఘనంగా జరిగింది . భరత నాట్యాలయ -చెన్నై డైరెక్టర్ ,కలై చూడామణి గురువు లతారవి సమక్షంలో యువ నర్తకి రేష్మి శుభశ్రీ భరతనాట్య ఆరంగేటం చేశారు. ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ వి .భవాని సుబ్బరాయణ్, ప్రముఖ నటి ఈశ్వరీ రావు , గౌరవ అతిథిగా భరతనాట్య కళారత్న డాక్టర్ రత్న సుబ్రహ్మణ్యం లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రేష్మి శుభశ్రీ ఆరబి రాగం, ఆదితాళంలో పుష్పాంజలితో భరతనాట్య అరంగేట్రంను ప్రారంభించారు. అనంతరం వర్ణం ,అటు తరువాత భో శంభో, బ్రహ్మ మొక్కటే పాటలకు తనదైన శైలిలో హావభావాలు పలికిస్తూ అభినయంతో నృత్యం చేసి అందరి కరతాల ధ్వనులను అందుకుంది .

చివరిగా తిల్లానా తో రేష్మి శుభశ్రీ నృత్యంలో తనదైన ప్రతిభను స్పష్టంగా తెలియజేసి ప్రేక్షకులను కనువిందు చేసింది. ఈ సందర్భంగా అతిధులతో పాటు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న తెలుగు ప్రముఖులు ఆస్కా అధ్యక్షులు డాక్టర్ కె సుబ్బారెడ్డి, అన్నా డీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ వి. సునీల్ , పారిశ్రామికవేత్త అనిల్ కుమార్ రెడ్డి అడ్వకేట్ రవీంద్రనాథ్ కూచిపూడి కళాకారులు మాధవ పెద్ది మూర్తి తదితరులు పాల్గొని చిన్నారి రేష్మి శుభశ్రీని సత్కరించి జ్ఞాపి కలు అందించి ఆశీర్వదించారు.

చెన్నై అన్నానగర్ లో ఉన్న చెన్నై పబ్లిక్ స్కూల్ లో ప్లస్ వన్ చదువుతున్న రేష్మి శుభశ్రీ నృత్యానికి నట్టువాంగం పై ఆర్. వనమాలిక ,గాత్రం టి హెచ్ త్యాగరాజన్, మృదంగంపై ధనంజయన్ , వయోలిన్ పై వి. శంకర్ , వేణువు పై జి .నటరాజ్ లు గాత్ర, వాద్య సహకారం అందించారు.
….

About Author