చెన్నై న్యూస్:ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2024వ సంవత్సరం మెంబర్స్ డైరెక్టరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. చెన్నై కొరట్టూర్ అగ్రహారం లోని ఆంధ్ర కళా స్రవంతి హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్టర్డ్ ఇంజనీర్ డాక్టర్ బి.ఎన్ గుప్తా దంపతులు పాల్గొని ఆంధ్ర కళా స్రవంతి మెంబర్స్ డైరెక్టరీని ఘనంగా ఆవిష్కరించారు . ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సలహాదారులు ఎమ్ ఎస్ మూర్తితో పాటు సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి జి వి. రమణ , వైస్ ప్రెసిడెంట్లు కె ఎన్ సురేష్ బాబు, వి ఎన్ హరినాధ్, సరస్వతి ,సభ్యులు పాల్గొని మెంబర్స్ డైరెక్టరీ ని అందుకున్నారు. ఈ సందర్భంగా జె ఎం నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర కళా స్రవంతి తరపున ప్రతి రెండేళ్లకు ఒకసారి మెంబర్స్ డైరెక్టరీని తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే 2024వ సంవత్సరం మెంబర్స్ డైరెక్టరీ ని ఆవిష్కరించడం, దానిని దాత డాక్టర్ బి ఎన్ గుప్తా చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు .సభ్యుల వివరాలు, చిరునామా, ఫోన్ నెంబర్లతో ,ప్రముఖులను సత్కరించుకున్న వివరాలు కూడా ఈ డైరెక్టరీ లో ఉంచామని తెలిపారు. సభ్యులందరికీ ఈ డైరెక్టరీ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 250 మంది పేదలకు ఆంధ్ర కళా స్రవంతి తరపున అన్నదానం చేసినట్లు తెలిపారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బి.ఎన్ . గుప్తా మాట్లాడుతూ ఆంధ్ర కళా స్రవంతి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సంస్థ అభివృద్ధికి తనవంతుగా సహాయ పడుతానని హామీఇచ్చారు. మెంబర్స్ డైరెక్టరీ కూడా తీసుకురావడం నిజంగా అభినందనీయం అన్నారు . మహిళ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
More Stories
Chennai Half Marathon 2024 receives over 6000 entries
அகத்தியர் லோப முத்ரா சிலைகள் பழமையான சிவன் ஆலயத்திற்கு நன்கொடை
ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా గోపూజ