September 19, 2024

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యం

చెన్నై న్యూస్: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఉద్భోదించారు .జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) -చెన్నై విభాగం ఆధ్వర్యంలో వాల్మీకి రామాయణంలోని సుందరకాండపై క్విజ్ పోటీలను చిన్న జీయర్ స్వామి మంగళా శాసనాలతో, ప్రత్యక్ష పర్యవేక్షణులో జూన్ 15వ తేదీన
చెన్నై రాయపేట పీటర్స్ రోడ్డులో ఉన్న ఇ. ఎన్. శేషా మహల్ వేదికగా నిర్వహించారు. వేద పారాయణంతో క్విజ్ పోటీలు ఆరంభమయ్యాయి. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులతో పాటు పెద్దలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతిని ఓంకార్ సుందర కుమార్, ద్వితీయ బహుమతిని హెచ్ శ్రావణ్, తృతీయ బహుమతిని శృతి మురళి నిలిచారు. అలాగే ప్రోత్సాహక బహుమతులను జయంతి సాయికుమార్, డాక్టర్ మేఘన జె కుమార్ , ఎన్ కృష్ణకుమారి, ఎం. పావని, తరంగిణిలు నిలిచారు. ప్రథమ బహుమతిగా రూ.5,000 ,ద్వితీయ బహుమతిగా రూ. 3,000, తృతీయ బహుమతిగా రూ.2000, ప్రోత్సాహక బహుమతిగా ఐదుగురికి తలా రూ.1,000 చొచ్చన చినజీయర్ స్వామి చేతుల మీదుగా బహూకరించి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి విద్యార్థులు, మహిళ ఆరోగ్యాన్ని ఉద్దేశించి అభిలాషిస్తూ విద్యార్థి దశ నుంచే మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. పిల్లలకు రామాయణంలోని కీలక ఘట్టాల గురించి అవగాహన కల్పించే విధంగా జెట్-చెన్నై వారు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ పైన మహిళలు అవగాహన పెంచుకోవాలని సూచించారు .జెట్ తరఫున వేలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ లను నిర్వహించినట్టు గుర్తు చేశారు. మహిళల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉంటుందని ఉద్బోధించారు.ఈ కార్యక్రమంలో అహోబిల రామానుజ జీయర్ స్వామి , కొంతమంది వేద పండితులు పాల్గొన్నారు.
జెట్-చెన్నై అధ్యక్షుడు పి.రవీంద్రకుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇందులో శ్రీ సిటీ అధినేత రవి సన్నారెడ్డి, గోపురం పసుపు సంస్థ అధినేత వైవీ హరికృష్ణ , పీ వీ ఆర్ కృష్ణారావు, శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయ ధర్మకర్త, చైర్మన్ వసంత్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా రాయపేట లోని పురాతన శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవస్థానంలో ప్రత్యేక పూజలను లోక సంక్షేమార్థం నిర్వహించారు.అలాగే జూన్ 16 వ తేదీన చిన్న జీయర్ స్వామి సమక్షంలో తీర్ధగోష్టి కార్యక్రమం వైభవంగా జరిగింది.

About Author