December 22, 2024

తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వారాహి సర్వ కార్య సిద్ధి పూజ

చెన్నై న్యూస్ : తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ( మద్రాస్ యూనిట్ )ఆధ్వర్యంలో ఆషాడ శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వారాహి సర్వ కార్య సిద్ధి పూజ ను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళా సభ చైర్పర్సన్ అనిత రమేష్ , సెక్రటరీ లక్ష్మీశశి కర్లపాటి , కోశాధికారి వసుంధర సుంకు సమక్షంలో పూజా కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం పండితులు దిలీప్ కుమార్ పంతులు నేతృత్వంలో శ్రీ వారాహి సిద్ధి కార్యా పూజ కార్యక్రమాన్ని జరిపించారు. ముందుగా వారాహి అమ్మవారిని దీపాన్ని విశేషంగా అలంకరింపజేశారు .దాదాపు 200 మందికి పైగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు.వారాహి అమ్మవారి పటాన్ని ఉంచి ,దీపాలు వెలివించి దీప పూజను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు .వారాహి మాతను, శ్రీ కన్యకా పరమేశ్వరుని స్మరించుకుంటూ దాదాపు రెండు గంటల పాటు నిర్వహించారు ఈ సందర్భంగా దిలీప్ కుమార్ పంతులు వారాహి పూజ విశిష్టతను, ఆ పూజ వల్ల కలిగే మంచి ఫలితాలను భక్తులకు వివరించారు .ఈ పూజ చేయడం వలన శత్రు నాశనం జరుగుతుందని, అలాగే ప్రతి పని జయప్రదం అవుతుందని, జ్ఞానం సిద్ధిస్తుందని ,సకల సౌభాగ్యాలు ,ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. అనంతరం మహిళా సభ చైర్పర్సన్ అనిత రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ మద్రాసు యూనిట్ తరపున
ఆషాడ మాస మొదటి శుక్రవారం పూజలను శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు .అమ్మవారి సన్నిధిలో మహిళలంతా కలిసి ఈ పూజను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ,అందరికీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కూడా మెండుగా లభించాలని ఆకాంక్షించారు. మహిళా సభ సెక్రటరీ లక్ష్మీ శశి కర్లపాటి మాట్లాడుతూ ఈ పూజను లోక క్షేమం కోసం దీప పూజను నిర్వహించామని భక్తులంతా విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా తెలుగు తరుణి మహిళ సభ్యుల బృందం వారాహి అమ్మవారిని, వాసవీ మాతను స్మరిస్తూ భక్తి పాటలను శ్రావ్యం గా ఆలపించి అలరించారు.ఈ
పూజల్లో భాగంగా తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ తరపున పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పంపిణీ చేసినట్టు మహిళ సభ కోశాధికారి వసుంధర సుంకు తెలిపారు.ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళ సభ సభ్యులు, మాజీ చైర్ పర్సన్ లు పాల్గొన్నారు.

About Author