September 19, 2024

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా వి502 ఏ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పసుపు కొమ్ముల పూజ

చెన్నైన్యూస్: వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా వి502 ఏ ఆధ్వర్యంలో లోక సంక్షేమం కోసం గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా ఆదివారం ముచ్చటగా మూడు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అరుదైన స్థానం సంపాదించుకుంది. వసుదైక కుటుంబకం- త్రివేణి సంగమం పేరిట లక్ష పసుపు కొమ్ముల పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేదికపై ముగ్గురమ్మలను ,వినాయకుడు, వెంకటేశ్వర స్వామి తో పాటు ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు .జిల్లా గవర్నర్ రేష్మి ఓలేటి సారథ్యంలో మహిళలు ఆరాధనలు నిర్వహించారు. భక్తి పాటలతో అలరించారు. మరోవైపు ఇంటిపట్టున ఉండే మహిళలు తయారుచేసిన అలంకరణ, గృహ ఉపకరణ, పిండి వంటలు ప్రదర్శిస్తూ వైశ్య వ్యాపార్- 2024 పేరిట దాదాపు 30 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సందర్శకులతో స్టాల్స్ కళకళలాడాయి. చివరి కార్యక్రమంగా ఆదివారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సభ్యులలో భక్తి భావాన్ని పెంచింది. ఈ కార్యక్రమం
చెన్నై ఆల్వార్ పేటలోని యతిరాజ కళ్యాణ నిలయం వేదికగా జిల్లా గవర్నర్ రేష్మి ఓలేటి , క్యాబినెట్ సెక్రటరీ ఎం .లావణ్య, క్యాబినెట్ కోశాధికారి అచ్చా ఆనంద్ ల పర్యవేక్షణలో విజయవంతంగా ముగిశాయి.ఈ పూజల్లో 40 కి పైగా వాసవీ క్లబ్ ల నిర్వాహకులు, సభ్యులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న 500 మంది ముత్తైదువులకు చీరలు, పసుపు కొమ్ములు, కుంకుమ, అమ్మవారి పటాలను , ప్రసాద వినియోగం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ రేష్మి ఓలేటి మాట్లాడుతూ వసుదైక కుటుంబకం, త్రివేణి సంగమం పేరిట ఏర్పాటు చేసిన మూడు వైవిధ్య కార్యక్రమాలకు సభ్యుల నుంచి స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు .వాసవి క్లబ్ చెన్నపట్న కార్యక్రమాల నిర్వహణలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

About Author