చెన్నై న్యూస్ : జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) -చెన్నై ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన 30 వ వార్షిక ఆథ్యాత్మిక పోటీలు విజయవంతంగా ముగిశాయి .ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాల నుంచి దాదాపు 1200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులు, సర్టిఫికేట్లు బహుకరించి అభినందించారు . జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ – చెన్నై విభాగం అధ్యక్షులు రవీంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన జూలై 14న భజన పోటీలు నిర్వహించగా జూలై 20, 21 తేదీల్లో రెండు రోజులు పాటు రామాయణంలోని సుందరకాండ పై డ్రాయింగ్ , క్విజ్ పోటీలు, విష్ణు సహస్రనామం, అష్టకాలు, యతిరాజ వింసతి, రామాయణం నూట్రందది, నాలాయిర దివ్య ప్రబంధం మొదలైన ఆధ్యాత్మిక పోటీలు ఘనంగా నిర్వహించారు. జులై 20 వ తేదీ శనివారం జరిగిన పోటీలకు శ్రీ త్రిడంది ఆహోబిల రామానుజ జీయర్ స్వామి పాల్గొని పోటీలను ప్రారంభించి చిన్నారులను ఆశీర్వదించారు. అలాగే జులై 21 వ తేదీ ఆదివారం పోటీలను గురుపూర్ణిమ సందర్భంగా ముందుగా చిన్నజీయర్ స్వామికి అష్టోత్తర పూజలు చేసి ప్రారంభించారు. చిన్నారులను ఉద్దేశించి రవీంద్రకుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో.. జెట్ చెన్నై వార్షిక పోటీలు -2024 మూడు రోజులు పాటు నిర్వహించా మన్నారు. విద్యార్థుల ఉత్సాహంగా, ఆసక్తిగా పాల్గొడంతోపాటు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎక్కువగా ఉందని అన్నారు . రానున్న రోజులో ఈ వార్షిక ఆధ్యాత్మిక పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించేందకు కృషి చేస్తామని అన్నారు . ప్రదానంగా జెట్ వార్షిక పోటీలకు దాతలు సహకారం మరువలేనిదని తెలిపారు . జెట్- చెన్నై వార్షిక పోటీలకు శ్రీసిటీ,గోపురం పసుపు సంస్థ, విపిఆర్, నాయుడు హాలు నిర్వాహకులతో సహా ఎంతో మంది దాతల సహయ సహకారాలు అందించారని వారికి జెట్ –చెన్నై తరపున ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ పిడి చారిటీస్ ట్రస్టీలు ఊటుకూరు శరత్ కుమార్, ఎస్ఎల్ సుదర్శనం , కిషోర్, డిఆర్ బి సిసిసి చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీ ముక్కాల కన్నయ్య శెట్టి, పిఆర్ సి చారిటీస్ కి చెందిన కోటా సుధాకర్ , కాకుమాని చారిటీస్ నిర్వాహలతో పాటు ప్రముఖులు, జెట్ సభ్యులు పివిఆర్ కృష్ణారావు ఇతర జెట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
..
More Stories
Dr. M.G.R. Educational and Research Institute- Maduravoyal, Chennai 33rd CONVOCATION – Session-1
Young hands come together to promote energy conservation at Power Grid’s painting competition
JGU and IIT Madras Collaborate to Design Advanced Robot Tour Guide for India’s First Constitution Museum