December 23, 2024

ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

చెన్నై న్యూస్: ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు . చెన్నై జార్జి టౌన్ ఆదియప్పన్ వీధిలో ఉన్న 300 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉన్న గోశాలలో నిర్వహించిన ఈ వేడుకలకు ఆర్యవైశ్య అన్నదాన సభ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించారు .ముందుగా గోశాలలోని గోవులకు పసుపు , కుంకుమ అద్ది , పూలతో , వస్త్రాలతో అలంకరించి గోమాత కు పూజలు చేశారు. మహిలంతా సౌభాగ్యంగా , సంతోషంగా జీవించాలని , లోకమంతా క్షేమంగా ఉండాలని కోరుతో గోపూజను భక్తులంతా కలసి ప్రార్ధించారు. అనంతరం లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణం తో పాటు ఆధ్యాత్మిక భక్తి పాటలు శ్రావ్యంగా అలపించి భక్తిని చాటుకున్నారు. మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి సన్నిధిలో వాసవీ అమ్మవారిని దర్శించుకున్నారు.స్త్రీలకు తాంబూలం తో పాటు భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సభ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య అన్నదాన సభ ను స్థాపించామని అన్నారు. ఈ సభ ద్వారా ప్రతినెల అమావాస్య రోజున ,అలాగే ప్రతి పౌర్ణమి రోజున సభ్యులంతా కలిసి ఆధ్యాత్మిక గీతాలను, గో పూజలను విశేషంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ నెలా అమావాస్య రోజున స్థానిక బ్రాడ్ వే లోని వరద ముత్తియప్పన్ వీధిలో ఉన్న యతిరాజ మహిళా మండలి -గీతా మందిరంలో ఆర్యవైశ్య అన్నదాన సభ తరపున సునాధ వినోదని బృందం చే భక్తి పాటలను ఆల పిస్తామని, అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం లోని గోశాలలో గోపూజను వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు ..ఈ పూజల్లో నగరంలోని మహిళలంతా అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను పూజిస్తూ, భక్తి పాటలు ఆలపిస్తూ గోమతను, వాసవీ అమ్మవారిని వేడుకుంటామని అన్నారు. ఈ సభ ను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకు తీసుకుని వెళ్లేందుకు మనసున్న దాతలు సహకారం ఎంతైనా అవసరం అని అన్నారు. మరిన్ని వివరాలకు భాగ్యలక్ష్మి 99529 83595 ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరని కోరారు.

About Author