December 23, 2024

జులై 27 – 31 వరకు అయోధ్యలో జరుగు శతకోటి గాయత్రీ మహా పూర్ణహుతిని విజయవంతం చేయండి.. పోరూరి శ్రీనివాస రావు

చెన్నై న్యూస్ : అయోధ్యలోని బాలరాముని సన్నిదిలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన శతకోటి గాయత్రీ మహామంత్ర జప మహాపూర్ణాహుతి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు అధ్యాత్మిక అనుబంధ సంస్థగా ఉన్న సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి -చెన్నై విభాగం కో – ఆర్డినేటర్ పోరూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం ఉదయం స్థానిక విల్లివాక్కంలో జరిగిన సమావేశంలో పోరూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ విశ్వశాంతి, లోక కళ్యాణార్థం కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ నిర్వహకులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీ రామ చంద్రమూర్తి సారథ్యంలో ఈనెల 27 నుంచి 31 వరకు శతకోటి గాయత్రీ మహామంత్ర జప మహాపూర్ణాహుతి మహోత్సవం అయోధ్యలో జరుగునుందని అన్నారు .ఐదు రోజులు పాటు సాగనున్న ఈ మహోత్సవంలో భాగంగా శ్రీరామపట్టాభిషేకం, సీతారాములు కల్యాణం, నగర సంకీర్తనం, పవిత్ర సరయు నదిలో స్నానం, రామాయణ పారాయణం కుంకుమార్చన. సత్యనారాయణ వ్రతం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నైతోపాటు తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాపకులు ఈ మహోత్సవానికి తరలివెళ్తున్నట్టు పేర్కొన్నారు. లోక కల్యాణార్థం అయోధ్యపురిలో న భూతో న భవిష్యత్ అన్నట్టుగా చేపడుతున్న శతకోటి గాయత్రీ మహామంత్ర జప మహాహూర్ణాహుతికి సంబంధించి ఈ సమావేశంలో శ్రీ గాయత్రీ దేవి చిత్ర పటాన్ని పోరూరి శ్రీనివాస రావు ఘనంగా ఆవిష్కరించారు. భక్తులందరూ వచ్చి అ
యోధ్యలోని బాలరాముని అనుగ్రహం పొందాలని కోరారు.

.

About Author