November 21, 2024

చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ సంబరాలు.

చెన్నై న్యూస్:ఆషాడ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రజల మోముల్లో ఆనందం వెల్లి విరుస్తుంది .తెలంగాణలో ఈ బోనాలు పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు.ఈ క్రమంలో చెన్నై నగరంలో దశాబ్దాలుగా నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సైతం బోనాల పండుగ సంబరాలను అంబరాన్ని అంటేలా చేసుకుంటున్నారు.

   చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం బోనాల పండుగును  ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఇంటి దగ్గర నుంచి బోనాలు తయారు చేసుకుని ఆదివారం ఉదయం 8 గంటలపైగా చెన్నై మింట్‌ వీదిలోని రేణుక పరమేశ్వరి ( చినకడమ్మ కోయిల్‌) నుంచి కొండితోపు  పార్కు వెనుకాల  ఉన్న ఆదిపరాశక్తి అమ్మవారి గుడి దగ్గర వరకు ఒగ్గు కళాకారులతో ఊరేగింపుగా తరలి వచ్చారు.  ఈ వేడుకలను ముఖ్యఅతిథిగా విచ్చేసి  రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి పికే శేఖర్‌ బాబు ఘనంగా ప్రారంభించారు. విశిష్ట అతిథిలుగా తమిళనాడు తెలుగు పీపుల్‌  సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ రాజు , డిఎంకే నాయకులు S. మురళీ, అపరంజి ,అన్నాదురై తదితరుల పాల్గొని బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ బోనాల ఊరేగింపులో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్‌ గ్రామంకు చెందిన టి. విజయ్‌కుమార్‌ ఒగ్గు కళాకారుల బృందం ఆద్యంతం తమదైన కళా ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కుల మాతాలకు అతీతంగా తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో కుటుంబ సమేతంగా బోనాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆది పరాశక్తి  అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.యలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.ఈ సందర్భంగా దేవరకొండ రాజు మాట్లాడుతూ  తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ పండుగ, బోనాల పండుగలను చెన్నైలో నివశిస్తున్న తెలంగాణ ప్రజలు ఐక్యమత్యంతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు . చెన్నైలో ఉంటూ తెలంగాణ పండుగల గొప్పతనాన్ని నగరవాసులకు తెలియ జేయడంతో పాటు  ఇతరలు సైతం ఆచరించేలా చేస్తున్నారని అన్నారు .చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో  అత్యంత వైభవంగా బోనాలు జరుపుకోవటంపై సంఘ కార్యవర్గాన్ని , సభ్యులను మనస్పూర్తిగా అభినందించారు.ఈ వేడుకలు సందర్భంగా అతిథులను సంఘ కార్యవర్గసభ్యులంతా కలసి శాలువాలతో ఘనంగా సత్కరించుకున్నారు .

About Author