December 23, 2024

సమాజ సేవే లక్ష్యం….లయన్స్ క్లబ్ ఆఫ్ మద్రాసు సౌత్ సిటీ నూతన అధ్యక్షురాలు డాక్టర్ ఏ వి శివకుమారి.

చెన్నై న్యూస్: సమాజ సేవలోనే ఆత్మసంతృప్తి లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ మద్రాసు సౌత్ సిటీ నూతన అధ్యక్షురాలు డాక్టర్ ఏ వి శివకుమారి అన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకెళ్ళుతామని ఆమె అభిప్రాయ పడ్డారు.
లయన్స్‌ క్లబ్‌ జిల్లా 324 M లోని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మద్రాసు సౌత్‌ సిటీ 2024–25 సంవత్సరానికి నూతన కార్యవర్గ భాద్యత స్వీకరణ కార్యక్రమం జులై 31వ తేదీ బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. చెన్నై ఎగ్మోర్‌లోని లయన్స్‌ క్లబ్‌ సెంట్రల్‌ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా చైర్మన్ (ఫైనాన్స్) లయన్ సి టి నటేషన్‌ ,గౌరవ అతిధులుగా క్యాబినేట్ సెక్రటరీ మీనాక్షి సుందర్ , క్యాబినెట్ ట్రెజరర్ శేఖర్, జోన్ చైర్ పర్సన్ విఘ్నేశ్వరన్ పాల్గొన్నారు.ఈసందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మద్రాసు సౌత్‌ సిటీ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా తెలుగు ప్రముఖులు డాక్టర్‌ ఏవీ శివకుమారి, సెక్రటరీగా టి. రుక్మిణీ, కోశాధికారిగా విజయలక్ష్మీల చేత పదవి ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సౌత్‌ సిటీ క్లబ్‌ మంచి ప్రాజెక్టులను చేపట్టి బెస్ట్‌ క్లబ్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లయన్‌ కల్యాణి , లయన్‌ శివకుమారి , లయన్‌ జయంతి ప్రభాకర్‌లు డయాలసిస్‌ ప్రాజెక్టుకు విరాళం అందించారు. అన్నదానంకు విజయలక్ష్మి, క్రీడా విద్యార్థికి రుక్మిణి, హార్ట్ పేషెంట్ కు రాణి సహాయం అందించారు.ముందుగా సీనియర్ సభ్యులు లయన్‌ శ్రీలక్ష్మీ మోహన రావు ముఖ్యఅతిథిని సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సలహాదారు వైజయంతి భాష్యకారులు , మీనాక్షి సుందరం, భువనేశ్వరీ, రేవతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author