చెన్నై న్యూస్:చెన్నై జార్జ్ టౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఐ క్యూ ఏ సి , సృజన తెలుగు భాష మండలి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్ విభాగాలు పోటీలు ఆగష్టు 1వ తేదీన ఉత్సాహంగా జరిగాయి. వాసవీ మాత ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.మోహన శ్రీ అధ్యక్షత వహించారు.తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ P S మైధిలి ,ఐ క్యూ ఏ సి కో-ఆర్డినేటర్ డాక్టర్ బి భరణి కుమారీలు పోటీలను పర్యవేక్షించి, స్వాగతం పలికారు. .ముఖ్యఅతిథిగా దుర్గా స్రవంతి సభ్యురాలు డాక్టర్ దామెర్ల పద్మావతి, ఐ కె ఏ ఎస్ టెక్నాలజీస్ డైరెక్టర్ శోభారాజాలు పాల్గొన్నారు . విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ద్వంద గానం పోటీల్లో వివిధ రకాల పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు . అలాగే మన తెలుగు- మన వెలుగు సామూహిక పోటీల్లో విద్యార్థినిలు తమదైన ప్రతిభను ప్రదర్శించారు . జానపద పాటలకు నృత్యాలతో అలరించారు. ఇంకా పొడుపు కథలు, తెలుగు సాహిత్యంలోని పలు విషయాలపై పోటాపోటీగా సమాధానాలు చెప్పి వారి మెదడుకు పదును పెట్టారు .అలాగే విద్యార్థులు వివిధ రకాల రంగులు విశిష్టతను గురించి ప్రత్యేకంగా వివరించి అబ్బురపరించారు.. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను కొనియాడారు . ..అతిధులు విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టిపడే రీతిలో హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు .విద్యార్థులు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోనేందుకు కృషి చేయాలన్నారు. మాతృభాష మరువద్దని హితవు పలికారు. .ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు బహుమతులను అందించి ఆశీర్వదించారు. అతిధులను డాక్టర్ టి. మోహన శ్రీ, డాక్టర్ పి ఎస్ మైథిలి కలసి ఘ
నంగా సత్కరించారు.
…
More Stories
Chennai Half Marathon 2024 receives over 6000 entries
அகத்தியர் லோப முத்ரா சிலைகள் பழமையான சிவன் ஆலயத்திற்கு நன்கொடை
ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా గోపూజ