December 23, 2024

ఆర్యవైశ్య ఆశ్రమంలోని వృద్ధులకు సాయం అందిన ఆర్యవైశ్య అన్నదాన సభ

చెన్నై న్యూస్: ఆడి అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదీన చెన్నై మాధవరం సమీపంలో ఉన్న ఉద్గిత ట్రస్ట్ నిర్వహణలో నడుస్తున్న ఆర్యవైశ్య ఆశ్రమంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు, కూరగాయలు ,బియ్యం తదితర సామాగ్రి దాదాపు రూ.4,500 విలువచేసే వస్తువులను వితరణ చేశారు. ఆర్యవైశ్య అన్నదాన సభ నిర్వాహకురాలు భాగ్యలక్ష్మి నేతృత్వంలో ఎనిమిది మంది మహిళ సభ్యులతో కలసి ఆశ్రమానికి చేరుకుని ఆశ్రమ నిర్వాహకులకు నిత్యవసర సరుకులను అప్పగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశ్రమంలో నివశిస్తున్న వృద్ధులతో సంతోషంగా గడిపారు.వృద్ధుల ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ ఆర్యవైశ్య అన్నదాన సభ నేతృత్వంలో సహాయం అందించేందుకు వీలు కల్పించిన ఉద్గిత ట్రస్ట్ నిర్వాహకులు భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ ట్రస్ట్ మరింత మందికి ఆశ్రయం అందించి సేవ చేయాలని ఆకాంక్షించారు.వృద్ధులతో గడిపిన ఈ క్షణాలు మధురానుభూతిని కలిగించాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సహాయక కార్యక్రమంలో శైలజ శేఖర్, ద్రాక్షాయిని బాబు తమ వంతు సాయం అందించారని తెలిపారు. దాతలు సాయం అందించాలంటే ఆర్యవైశ్య అన్నదాన సభ నిర్వాహకులను భాగ్యలక్ష్మి ఫోన్ నెంబర్ 99529 83595 సంప్రదించగలరు. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా దాతలు సాయం అందించవచ్చునని నిర్వహకులు కోరారు

About Author