చెన్నై న్యూస్: చెన్నై షావుకారు పేటలోని శ్రీ వాసవి మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఆడి శుక్రవారం సందర్భంగా నవా వర్ణ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని మహా మండపం వేదికగా రాజరాజేశ్వరి అమ్మవారిని కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించి నా నవా వర్ణ పూజలను చేశారు.ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ, పండ్లు ,తాంబూలం,చీరలను సమర్పించారు. ఆలయ అర్చకులు దిలీప్ పంతులు పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా భక్తుల చేత చేయించారు.శ్రీ వాసవి మహిళా విభాగ్ ట్రస్టీలు విశాలక్ష్మీ , ఏకే వసుమతి, టి .లావణ్య, జి .సరళబాలాజీ, సుజాత, సరళ మనోహర గుప్తా, లలిత, మాధురి, కల్పన, సాహిత్య, మహాతీబద్రీనాధ్ లు ఏర్పాట్లను పర్యవేక్షించారు .
250 మందికి పైగా మహిళలు విచ్చేసి మహా మండపంలో కూర్చొని వినాయక పూజలో పాటు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరాలను , లక్ష్మీ అష్టోత్తరం , శ్రీ కన్యకా పరమేశ్వరి అష్టోత్తరం, లలిత త్రిసతి అష్టోత్తరాలను భక్తిశ్రద్ధలతో బృంద పారాయణం చేసి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. కే టి సి టి బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థులు భక్తులకు పూజా వస్తువులను పంపిణీలో సేవ చేశారు.భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు తోపాటు సుమంగళి ద్రవ్యాలను పంపిణీ చేశారు.శ్రీ వాసవీ మహిళా విభాగ్ సీనియర్ ట్రస్టీ మన్నారు విశాలక్ష్మి మాట్లాడుతూ పూజా నిర్వహణకు ధన, వస్తు రూపేణా విరాళాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.30 సంవత్సరాలకు పైగా ప్రతీ సంవత్సరం ఆడి మాసంలో ఒక్కో దేవతను ప్రత్యేకంగా పూజిస్తూ ఆడి శుక్రవారం పూజలు నిర్వహించటం జరుగుతుందన్నారు . లోకక్షేమం కోసం ,మహిళల సౌభాగ్యంకోసం, సంతోషం కోసం తమ ట్రస్టీలంతా కలసి ఎంతో భక్తితో ఈ పూజలు చేస్తున్నట్టు వివరించారు.ఈ ఏడాది నవా వర్ణ పూజలు చేసినట్టు తెలిపారు.
….
….
[
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3