December 23, 2024

గో దానంతో మా జీవితాలు ధన్యమయ్యాయి-సూరిశెట్టి దివ్యా బాలాజీ

చెన్నై న్యూస్ : గో దానంతో మా జీవితాలు ధన్యమైయ్యాయని వాసవీ క్లబ్‌ వనిత ఎలైట్‌ చెన్నై అధ్యక్షురాలు సూరిశెట్టి దివ్యా బాలాజీ అన్నారు.

వాసవీ క్లబ్‌ ఎలైట్‌ చెన్నై , వాసవీ క్లబ్‌ వనిత ఎలైట్‌ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం మెగా గో దానం కార్యక్రమం వైభవంగా జరిగింది. క్లబ్‌ అధ్యక్షులు సూరిశెట్టి బాలాజీ , దివ్యా బాలాజీ ల సారథ్యంలో తొలుత శ్రీ కన్యకాపరమేశ్వరి మూలవిరాట్, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి కళాశాల ప్రాంగణంలో 25 గోవులను కొలువుదీర్చి గో దానం చేసిన 25 మంది దంపతులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు .ఆవులకు పసుపు , కుంకుమ అద్ది నూతన వస్త్రాలతో , పూలతో అలంకరించి పూజలు చేశారు .ఆలయ ప్రదాన అర్చకులు భాస్కర పంతుల బృందం గో దానానికి పూజాధి కార్యక్రమాలను సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. అనంతరం ఎస్‌కెపిడి చారిటీస్‌ నిర్వహణలోని గోశాలకు దానం చేసిన గోవులను పాలకమండలి సభ్యులు ఎస్‌ ఎల్‌ సుదర్శనం స్వీకరించారు . ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ ఎలైట్‌ చెన్నై , వనిత ఎలైట్‌ చెన్నై కోశాధికారులు పెనుగొండ వెంకటేష్, వనితశ్రీ తోపాటు గౌరవ అతిథిగా రీజన్‌ –1 రిజనల్‌ చైర్మెన్‌ జి.కె. మహీంద్ర, మాజీ గవర్నర్‌లు డాక్టర్ ఎం వి నారాయణ గుప్తా, సుజాత రమేష్‌ బాబు ఇంకా జగదీష్ తదితరులు పాల్గొనగా ఎస్‌కెపిడి పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు ఓ.లీలారాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అన్ని వాసవీ క్లబ్‌ల నిర్వాహకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ రవి చంద్రన్‌ ,వాసవీ క్లబ్‌ గవర్నర్‌ రేష్మీ ప్రోత్సాహంతోనే ఇలాంటి మహత్తర కార్యం చేసే అవకాశందక్కిందని దివ్యా బాలాజీ అన్నారు . వాసవీ మాత అనుగ్రహంతో విజయవంతంగా గోదానం కార్యక్రమం జరిగిందని సూరిశెట్టి బాలాజీ తెలిపారు . సేవా సంకల్పం చేసిన కుమరవేల్‌ , చిత్ర కుమరవేల్‌లకు ధన్యవాదాలు తెలిపారు,.

About Author