చెన్నై న్యూస్: ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకుని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్. డాక్టర్ సీఎం కే రెడ్డి అన్నారు. స్థానిక కీల్పాకంలోని A I T F ప్రధాన కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పలువురికి జాతీయ జండాలను పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో ఏ ఐ టీ ఎఫ్ ఉపాధ్యక్షులు, నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సి ఎం కిషోర్ 49వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పేదలకు అన్నదానం , విద్యార్థులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఇందులో ఏ ఐ టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి నాయకర్ఆర్.నందగోపాల్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి ఇజ్రాయిల్ , నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ ఎన్. నాగభూషణం ,ఏ ఐ టీ ఎఫ్ నాయకులు లయన్ జి. మురళి, తాళ్లూరి సురేష్, వి జి జయకుమార్, సి హెచ్ తిరుమల రావు, V. దేవదానం, స్వర్ణ జయపాల్, బి ఎన్ బాలాజీ , మోహన్ నాయుడు , K. V. జనార్దనం, కె ఎల్ కిరణ్, పోరూర్ శ్రీనివాస రావు, ,డాక్టర్ ఎం. హనుమంత రావు ,జి వి రామకృష్ణ,నరసింహారావు, చిట్టిబాబు , మునిస్వామి,శ్రీ కనకదుర్గ తెలుగు పాఠశాలల ఉపాధ్యాయులు , ఏఐటీఎఫ్ నిర్వాహకులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్న డాక్టర్ సీఎం కిషోర్ ని శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సి ఎం కె రెడ్డి మాట్లాడుతూదేశ స్వాతంత్ర్య కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పోరాట ఫలితం వల్లే మనం నేడు స్వచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామని అన్నారు.78వ స్వాతంత్ర్య దినోత్సవంను ఘనంగా జరుపుకునేందుకు ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపిలునిస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలులను తెలియజేశారు.
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3