చెన్నై న్యూస్:శ్రీ ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. చెన్నై కొరట్టూర్ అగ్రహారం , రామాలయం వీధిలో ఉన్న సీతారామ కల్యాణ మండపంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సాగాయి. వేడుకలలో తొలుత స్రవంతి సభ్యులంతా కలసి కృష్ణపూజను భక్తిశ్రద్దలతో చేశారు. అనంతరం ఉట్టి కొట్టే పోటీ నిర్వహించగా, వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంతో ఉట్టికొట్టి సందడి చేశారు. తమిళనాడు, ఒడిస్సీ , ఆంధ్ర, తెలంగాణా నృత్యాలతో కనువిందు చేశారు
ఇంకా చిత్రలేఖన, పాటల పోటీలు అనంతరం హాస్య ప్రదర్శనలు కడుపుబ్బ నవ్వించాయి.ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు జేఎం నాయుడు, కోశాధికారి G .V .రమణ, సలహాదారు ఎం ఎస్ మూర్తి, ఉపాధ్యక్షులు K .N. సురేష్ బాబు , V.N. హరినాధ్, ఇంకా రాజేంద్రన్, ఐ.బాలాజి, డి.మనోహరన్, ఎంఎస్ నాయుడు తదితరులు అతిథులను ఇతోధికంగా సన్మానించారు. అనంతరం పలు పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
More Stories
Chennai Half Marathon 2024 receives over 6000 entries
அகத்தியர் லோப முத்ரா சிலைகள் பழமையான சிவன் ஆலயத்திற்கு நன்கொடை
ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా గోపూజ