December 23, 2024

లోక కళ్యాణార్ధం వైభవంగా శ్రీ లలిత మణి ద్విప వర్ణన పూజ

చెన్నై న్యూస్:శ్రావణ శుక్రవారం సందర్భంగా లోక కళ్యాణార్ధం శ్రీ లలిత మణి ద్విప వర్ణన పూజలను నగరంలో వైభవంగా నిర్వహించారు.చెన్నై షావుకారు పేటలోని వాసవీ మినీ హాలు వేదికగా శ్రీ వాసవీ బిల్డర్స్ అండ్ ప్రొమోటర్స్ అధినేత జాలమడుగు హరికుమార్-కిరణ్ కుమారి దంపతుల పర్యవేక్షణలో వేదికపై శ్రీ లలితా అమ్మవారి విగ్రహాన్ని కొలువుదీర్చి సుందరంగా అలంకరించారు.అమ్మవారికి తొమ్మిది రకాల పువ్వులు, పత్రాలు, పండ్లు, నవధాన్యాలు, నెవైద్యాలుగా సమర్పించారు.తొమ్మిది మంది ముత్తైదువులు కూర్చుని మణిద్విప వర్ణన పూజను చేసి, తొమ్మిసార్లు పారాయణం చేసి భక్తిభవాన్ని చాటుకున్నారు.అనంతరం శ్రీ లలితా సహస్రనామ పారాయణనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరిగిన పూజల్లో పాల్గొన్న మహిళా మణులకు పాదపూజ పసుపు కుంకుమ, తాంబూలం, ప్రసాదాలు పంపిణీ చేశారు.రాష్ట్ర హిందు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు, డీఎంకే ప్రముఖులు S.మురళి , S. రాజశేఖర్, K.R. అపరంజి , అన్నదాసన్ , T.S. శేఖర్, జి సి అన్నామలై ,S. వెంకటేశన్ , C.గాంధీ ,వాగిచెర్ల సత్యనారాయణ , బాల మురుగన్, డాక్టర్ ప్రత్యూష సహా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అందరికీ తెలుగింటి వంటకాలను అందించారు.

About Author