December 23, 2024

ఘనంగా కె టి సి టి బాలికల ప్రాథమిక, మహోన్నత పాఠశాలల శత వార్షికోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్: బాలికల విద్యాతోనే దేశం ప్రగతిపథంలో ముందుకెళ్ళుతుందని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి పేర్కొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ చారిటీస్ (ఎస్ కె పి డి) నిర్వహణలో కొనసాగుతున్న కేటీసిటీ ప్రాథమిక, మహోన్నత బాలికల పాఠశాలల శత వార్షికోత్సవ వేడుకలను ఆదివారం చెన్నై చేట్ పేట లోని కుచలాంబల్ కళ్యాణమండపం వేదికగా జరుపుకున్నారు.ఎస్ కె పీ డీ మేనేజ్ మెంట్ కమిటీ, కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ,విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాలల గౌరవ కరస్పాండెంట్ S.L. సుదర్శనం ఆహ్వానం పలికారు. కె టి సి టి బాలికల మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే అనిల్ పాఠశాల చరిత్రను గురించి సభకు వివరించారు. ప్రార్థన గీతం ,జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా కుంభస్తూపం, వందేళ్ళ శిలాఫలకం , ప్రత్యేక సంచిక లను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ట్రస్టీలకు జ్ఞాపికలను బహుకరించారు .
ఈ సందర్భంగా గవర్నర్ ఆర్ ఎన్ రవి జై వాసవి.. జై జై వాసవి అనే నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఘన చరిత్ర కలిగిన ఎస్ కె పి డి నిర్వహణలోని కె టి సి టి విద్యాసంస్థల శత వార్షికోత్సవంలో తాను ముఖ్యఅతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు .1924లో చిన్నారులకు అక్షరాలు నేర్పి ,నేడు మహావృక్షంగా ఎదిగిన ఈ పాఠశాలల చరిత్రలో నిలిచిపోయిందన్నారు. మహిళా విద్య
దేశానికి ,కుటుంబ ఎదుగుదలకు పునాది వంటిదన్నారు.ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని , ఆ దిశగా ప్రధాని నరేంద్రమోడీ పాలన సాగుతోందని అభిప్రాయ పడ్డారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా కేటీసిటీ పూర్వ విద్యార్థిని డాక్టర్ రమా జయవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె పి డి ధర్మకర్త కొల్లా వెంకట చంద్రశేఖర్ ,పాలక మండలి సభ్యులు దేసు లక్ష్మీనారాయణ , టివి రామ కుమార్ ,సి ఆర్ కిషోర్ బాబు , కార్యదర్శి ఎం కిషోర్ కుమార్, సలహాదారులు డాక్టర్ జె.వి. రావు , ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చుక్కా రేవతి ,నగర ప్రముఖులు అజంతా డాక్టర్ కనిగలుపుల శంకరరావు ,పివిఆర్ కృష్ణారావు, సీఎం కే రెడ్డి , డాక్టర్ టి మోహన శ్రీ , శ్రీలక్ష్మీ మోహన రావు, డాక్టర్ ఏవీ శివకుమారి, ఎస్ కె పి సి ప్రిన్సిపాల్ డాక్టర్ టి.మోహన శ్రీ,తదితరులు పాల్గొన్నారు. శ్రీ కనకా పరమేశ్వరి మహిళా కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. చిన్నారులతో పలువురు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.

About Author