January 22, 2025

కష్టపడి చదవితే ఉజ్వల భవిష్యత్-రిటైర్డ్ పీజీ టీచర్ వి. కేశవులు

చెన్నై న్యూస్: కష్టపడి చదవితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చిన్మయా విద్యాలయ -కీల్పాక్ రిటైర్డ్ పీజీ టీచర్ వి. కేశవులు అన్నారు.చెన్నై లోని skpd అండ్ చారిటీస్ యాజమాన్యంలో కొనసాగుతున్న కెటిసిటి బాలికల ప్రాథమిక, మహోన్నత పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు.ఈ పాఠశాలల కరస్పాండెంట్ S.L. సుదర్శనం అధ్యక్షతన వహించి,ఉపాధ్యాయినీలందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కె టి సి టి బాలికల మహోన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు K. అనిల అతిథులను సభకు పరిచయం చేసి స్వాగతోపన్యాసం చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న V. కేశవులు, గౌరవఅతిథులుగా పాల్గొన్న పూర్వవిద్యార్థినిలు పద్మలత . రేణుకలతో కలసి ముందుగా మాజీ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాథాకృష్ణ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ కష్టపడి చదివితే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అన్నారు . విద్యార్థులు పట్టుదలతో, క్రమ శిక్షణతో ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని చదవాలని సూచించారు .ఉపాధ్యాయులు ప్రతీ ఒక్క విద్యార్థి జీవితంలో ప్రత్యేక భూమిక పోషిస్తారని గురువులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యాఖ్యాతగా విద్యార్ధిని ఈషా వ్యవహరించగా, ఉపాధ్యాయ దినోత్సవ సారాంశాన్ని కావలి సంధ్య చక్కగా వివరించారు. అలాగే ఉపాధ్యాయులకు శుభాకాంక్షల సందేశాన్ని ప్రియా వినిపించారు.అనంతరం ఉపాధ్యాయినిలకు గేమ్స్ నిర్వహించి బహుమతులను అందించారు . ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమ నిర్వహణను ఉపాధ్యాయిని డాక్టర్ S. కోమల చేపట్టగా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని చుక్కా రేవతి ఇంకా ఉపాధ్యాయినిలు ,విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author