December 22, 2024

టామ్స్ ప్రధాన కార్యాలయ కార్యదర్శి సీఈ తిరుమల రావు 50వ జన్మదిన వేడుకలు

చెన్నై న్యూస్:అంకితభావంతో సేవలందించే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) వ్యవస్థాపకులు డాక్టర్.గొల్లపల్లి ఇశ్రాయేలు అన్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) శానిటరీ సూపర్ వైజర్, టామ్స్ ప్రధాన కార్యాలయ కార్యదర్శి సీఈ తిరుమల రావు 50వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.చెన్నై వేపేరిలోని శాల్వేషన్ ఆర్మీ హెచ్ ఆర్ డి సెంటర్ వేదికగా టామ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గొల్లపల్లి ఇశ్రాయేలు, టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయకుమార్ సారధ్యం వహించారు. ఆహుతుల సమక్షంలో తిరుమలరావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఇశ్రాయేలు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో తిరుమల రావు సాహసోపేతంగా తన వంతు సాయంగా ప్రజలకు నిత్యావసర సరుకులు, మెడికల్ కిట్లు తదితరాలు పంపిణీ చేశారన్నారు, అదే విధంగా టామ్స్ తరపున కూడా ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ లా విభాగం ఆదనపు కార్యదర్శి జీసీ నాగూర్, జీసీసీ సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఎం.తిరుపాల్, అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) ప్రధాన కార్యదర్శి నాయకర్ ఆర్. నందగోపాల్, ఐజేకే నేత మన్నం రవిబాబు , టామ్స్ కు చెందిన బి ఎన్ బాలాజీ , అద్దంకి ఐసయ్య, వి.దేవదానం,టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్ , నూనె శ్రీనివాసులు, ఆంద్రప్రదేశ్ పామూరుకి చెందిన సామాజిక సేవకులు నూనె ప్రసాద్, ఎం.తిరుపాల్, మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చి సెక్రటరీ పోతల ప్రభుదాసు, కోశాధికారి ఏ. బాబు, టామ్స్ పాల్ కొండయ్య, ఎయిర్ పోర్ట్ గోపి, జనోదయం కి చెందిన స్వర్ణజయపాల్, పి. మస్తాన్, సుదర్శన్, రోశయ్య, అంబత్తూరు ఎన్. ఆనందరావు, వి.ఇశ్రాయేలు, డి ఎల్ ఆర్ రమేష్, ప్రసన్న , ఆముల్ రాజ్ , దీన దాయాలన్, పెంచలయ్య, టామ్స్ మహిళలు పాల్గొని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) శానిటరీ సూపర్ వైజర్ తిరుమల రావును శాలువాలతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ముందుగా టామ్స్ తరపున నిలువెత్తు గజమాలతో తిరుమల రావును సత్కరించారు.అందరికీ విందు భోజనం అందించారు.

About Author