December 23, 2024

ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో వైభవంగా గోపూజ

చెన్నై న్యూస్ :ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని గోపూజను వైభవంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం చెన్నై జార్జిటౌన్ లో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం గోశాలలో ఆర్యవైశ్య అన్నదాన సభ నిర్వాహకురాలు భాగ్యలక్ష్మి నేతృత్వంలో గోపూజలు చేపట్టారు. ముందుగా గోవులకు పసుపు ,కుంకుమ అద్ది , పూలతో , వస్త్రాలతో అలంకరించి గోపూజను ప్రారంభించారు. గోమాత ఆశీస్సులు ప్రతీ ఒక్కరికి లభించాలని కాంక్షిస్తూ ప్రత్యేకంగా పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలను అలపించి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ నెల పౌర్ణమి సందర్భంగా మూడేళ్ళ బాలుడికి నూతన వస్త్రాలను అందించారు.ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్య అన్నదాన సభ తరపున ప్రతీ నెలా అమావాస్య, పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.అందులో భాగంగానే పౌర్ణమి సందర్భంగా గోపూజను నిర్వహించామని పేర్కొన్నారు.తమ సభ తరపున మరింతగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నామని ,ఇందుకు దాతలు సహకారం కూడా అందించవచ్చునని అన్నారు. దాతలు సాయం అందించాలంటే ఆర్యవైశ్య అన్నదాన సభ నిర్వాహకులు భాగ్యలక్ష్మి ఫోన్ నెంబర్ 99529 83595 సంప్రదించగలరు. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా దాతలు సాయం అందించవచ్చునని కోరారు.

About Author