చెన్నైన్యూస్:మాస్ సంస్థ ద్వారా ఆది ఆంధ్ర, అరుంధతీయ విద్యార్థులకు స్వర్గీయులైన ఓ. జగ్గయ్య, కే. వెంకటేశ్వర్లు,గుర్రం మర్రయ్య లు చేసిన సేవలు ఎవ్వరూ పూడ్చలేనివని అతిథులు, వక్తలు కొనియాడారు. మద్రాసు ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం (మాస్)-చెన్నై ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన ఓ. జగ్గయ్య, కే వెంకటేశ్వర్లు, గుర్రం మర్రయ్యలకు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు.చెన్నై ఎగ్మోర్ లోని జీవనజ్యోతి ICSA సెంటర్ వేదికగా జరిగిన ఈ సభలో మాస్ సంస్థకు విశేష సేవలందించిన ఆ ముగ్గురు చిత్రపటాలకు అతిధులతో కలసి మాస్ కార్యవర్గం ఘనంగా నివాళులర్పించింది. మాస్ సంస్థ సలహాదారులు ఎ. జైసన్, గుడిమెట్ల చెన్నయ్య ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సభకు మాస్ అధ్యక్షులు డాక్టర్ కొల్లి రాజు అధ్యక్షత వహించారు .మాస్ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు అజరత్తయ్య కార్యదర్శి నివేదిక చదివి వినిపించారు. .ముందుగా గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ మాస్ సంస్థకు విశేష కృషి చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు మన మధ్య లేకపోవడం బాధాకరమని , అయితే వారి సేవలు ఎవ్వరూ పూడ్చలేనివి అని కొనియాడారు .మాస్ అధ్యక్షులు డాక్టర్ కొల్లి రాజు మాట్లాడుతూ మాస్ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ ఆశయాల మేరకు సంస్థ పనిచేస్తున్నట్లు తెలిపారు. త్రిమూర్తులుగా సేవలందించిన వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఎవరైనా ముందుకు రావాలని అన్నారు.ఈ సందర్భంగా ఆ ముగ్గురు మరణంతో ఖాళీగాఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవికి అనిల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పదవికి చెరుకూరి నాగార్జున రావు,కె.అన్నపూర్ణ లను నియమించినట్టుకు మాస్ ప్రధాన కార్యదర్శి అజరత్తయ్య ప్రకటించారు.ఈ కార్యక్రమంలోకోశాధికారి వీరయ్య,రవి చంద్రన్, యు.నాగయ్య, రాజశేఖర్ ,బెనర్జీ, పి.పాల్ కొండయ్య, ఎస్.సంగీత రావు, మాలకొండయ్య, కూనూరు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం మాస్ 2024 వార్షిక సర్వసభ్య సమావేశాన్ని అదే స్థలంలో నిర్వహించారు. డాక్టర్ కొల్లిరాజు అధ్యక్షత వహించగా, కోశాధికారి ఎం.వీరయ్య మాస్ ఆడిటర్ రిపోర్ట్ , అకౌంట్స్‌తో పాటు బ్యాలెన్స్ షీట్‌లను చదివి పూర్తి వివరాలను తెలియజేశారు.
…
More Stories
அழகு துறையில் உலக கின்னஸ் சாதனை ஆல் இண்டியா ஹேர் பியூட்டி அசோசேஸியன் சார்பில்
Road Safety Awareness Program & FREE Distribution of Helmet for Chennai Corporation School Students
ఘనంగా తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్) కార్నివల్ –2025 వేడుకలు