December 24, 2024

సూర్యచంద్రులు ఉన్నంత వరకు అమరజీవిని ప్రతీ భారతీయుడు స్మరించుకోవాలి -డాక్టర్ నూకసాని బాలాజీ వ్యాఖ్య

చెన్నై న్యూస్:సూర్య చంద్రులు ఉన్నత కాలం అమరజీవిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతీ భారతదేశ పౌరుడికి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ది కార్పోరేషన్ ఛైర్మెన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.చెన్నై మైలాపూర్ లోని అమరజీవి స్మారక భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి అమరజీవి పొట్టిశ్రీరాములుస్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షులు కె. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ది కార్పోరేషన్ ఛైర్మెన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు -తమిళనాడు R. శేఖర్, విశిష్ట అతిథులుగా కెన్సెస్ గ్రూప్ సీఈవో ముత్తినేని కృష్ణ, పారిశ్రామిక వేత్త ఏనుగంటి ఎరుకలయ్య పాల్గొని ముందుగా అమరజీవి శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ 58 రోజులు పాటు నిరాహారదీక్ష చేసి, పొట్టి శ్రీరాములు ఆంద్రులకు ప్రత్యేక రాష్ట్రం తీసుకుని వచ్చారన్నారు. వారి త్యాగాలను మరిచి పోకూడదన్నారు.పొట్టిశ్రీరాములు స్మాకర భవనం అభివృద్ధికి ,ఈ భవనం ప్రాచుర్యానికి తనవంతుగా కృషి చేస్తానని హామీఇచ్చారు. స్వాతంత్రోద్యమం ,దళిత ఉద్యమాలే కాకుండా, ఆనేక త్యాగాలు చేసిన గొప్పదేశభక్తుడు అమరజీవిని సూర్య చంద్రులు ఉన్నంతవరకు గుర్తించుకోవాలని అభిప్రాయపడ్డారు.

మాజీ డీజీపీ R. శేఖర్ మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని భావితరాలకు తెలియజేయాలని , ఆదిశగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వ్యాఖ్యానించారు. స్వాగతోపన్యాసంను స్మారక కమిటీ కార్యదర్శి , కోశాధికారి వి. కృష్ణారావు చేస్తూ అమరజీవి స్మారక భవన నిర్వాహణకు రావాల్సిన నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ముంజూరు చేసి ఆదుకోవాలి అని ,అతిథిగా పాల్గొన్న డాక్టర్ నూకసాని బాలాజీ దృష్టికి తీసుకెళ్ళారు. సభా నిర్వాహణను కమిటీ సంయుక్త కార్యదర్శి వూరా శశికళ చేపట్టారు. ప్రార్థనాగీతాన్ని అరుణాశ్రీనాద్ , వందన సమర్పణనును కమిటీ సభ్యులు జేఎం నాయుడు చేశారు. ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య ,డాక్టర్ ఎం వీ నారాయణగుప్తా, డాక్టర్ ఏవీ శివకుమారి , ఎస్ కె పి డి అండ్ చారిటీస్ మాజీ ట్రస్టీ ఊరా ఆంజనేయులు, ఎస్ .కె. పి.డి. ప్రధానోపాధ్యాయిని ఓ. లీలా రాణి తదితరులు పాల్గొన్నారు. చివరిగా ఎస్ కె పి డి బాలుర పాఠశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
..

About Author