January 22, 2025

ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పేదలకు దీపావళి కానుకలు వితరణ

చెన్నై న్యూస్:దీపావళి పండుగ అమావాస్యను పురస్కరించుకొని ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పేదలకు దీపావళి కానుకలను పంపిణీ చేశారు .చెన్నై బ్రాడ్ వే కందప్ప శెట్టి వీధి మినర్వా టాకీస్ సమీపంలోని వినాయక గుడి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ఆర్యవైశ్య అన్నదాన సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి నేతృత్వంలో జరిగింది .దాదాపు 50 మంది పేదలకు నూతన టవళ్ళు, స్వీట్లు మిక్చర్లను పంపిణీ చేశారు .ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి అని భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు.

అలాగే , గత నెల పౌర్ణమి సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం గోశాలలో గోపూజను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. గోవులకు పసుపు కుంకుమ అద్ది వస్త్రాలతో అలంకరించి గోమాతను వేడుకున్నారు ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని గోవులను సేవించి ఆశీస్సులు అందుకున్నారు .పౌర్ణమి సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు.అనంతరం ఆర్యవైశ్య అన్నదాన సభ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే పేర్కొంటూ పేద ప్రజలకు తమ వంతుగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రతీ అమావాస్య, ప్రతీ పౌర్ణమి రోజున మహిళలతో కలసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పూజలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు .మనసున్న దాతలు సహకారం అందిస్తే తమ సభ మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేపట్టుతుందని ఆమె అభిప్రాయపడ్డారు .దాతలు సహకారం అందించాలని అనుకుంటే ఆర్యవైశ్య అన్నదాన సభ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఫోన్ నంబర్ 99529 83595 ను సంప్రదించగలరని కోరారు.

..

About Author