చెన్నై న్యూస్ : సమాజానికి చేసిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా వాసవి క్లబ్ టు స్టార్ కెసిజిఎఫ్ ఎలైట్ చెన్నై ఉత్తమ క్లబ్ గా నిలిచి ఫస్ట్ డిస్ట్రిక్ట్ రోలింగ్ ట్రోఫీ -2024ని కైవసం చేసుకుంది.దీంతో9 ఏళ్ల కల సాకారమైందని వాసవీ క్లబ్ 2 స్టార్ KCGF ఎలైట్ చెన్నై ,వనిత ఎలైట్ చెన్నై క్లబ్ ల అధ్యక్షులు సూరిశెట్టి బాలాజీ ,దివ్య బాలాజీలు ఆనందం వ్యక్తం చేశారు .ఓలేటి బ్లాక్ బస్టర్ డిస్కాన్ రోలింగ్ ట్రోఫీ -2024 తో పాటు kCGF రోలింగ్ ట్రోఫీ, అలాగే వాసవీ క్లబ్ 2 స్టార్ వనిత ఎలైట్ చెన్నై సైతం మూడవ స్థానంలో నిలిచి ఉత్తమ హ్యాట్రిక్ వాసవి క్లబ్ గా నిలవడం చాలా చాలా సంతోషంగా ఉందని దివ్య బాలాజీ అభిప్రాయపడ్డారు.
చెన్నై చెట్ పేట్ లోని కుచలాంబాల్ కల్యాణ మహల్ వేదికగా వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వి 502 ఏ ఆధ్వర్యంలో ఓలేటి బ్లాక్ బస్టర్ ఇయర్-2024 వేడుకలతో పాటు 11వ వార్షిక జిల్లాస్థాయి (డిస్కాన్ ) సదస్సు నిర్వహించారు.వాసవీ క్లబ్ వి502 ఏ గవర్నర్ రష్మి ఓలేటి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సుమారు 40 క్లబ్ లు పాల్గొన్నారు.ఇందులో వాసవీ క్లబ్ 2 స్టార్ KCGF ఎలైట్ చెన్నై ,వనిత ఎలైట్ చెన్నై క్లబ్ ల నుంచి 55 మంది సభ్యులు పాల్గొన్నారు. సమాజానికి ఉత్తమ సేవలు అందించిన క్లబ్ లకు అవార్డులు, రోలింగ్ ట్రోఫీలు అందించారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా మూడు ట్రోఫీలతో హ్యాట్రిక్ క్లబ్ లు గా వాసవీ క్లబ్ 2 స్టార్ ఎలైట్ చెన్నై, వనిత ఎలైట్ చెన్నై క్లబ్ లు ట్రోఫీలు అతిధుల చేతుల మీదుగా అందుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ రోలింగ్ ట్రోఫీ ని వసవీక్లబ్ 2 స్టార్ KCGF ఎలైట్ చెన్నై అధ్యక్షులు సూరిశెట్టి బాలాజీ అందుకున్నారు.ఈ సందర్భంగా సూరిశెట్టి దివ్య బాలాజీ మాట్లాడుతూ 11 నెలలు ఎంతో ప్రణాళికతో సమాజానికి ఉపయోగ పడే ప్రాజెక్టు లను ఎన్నుకొని మరీ సేవ చేశామని తెలిపారు .ముఖ్యంగా జి జి కుమరవేల్ ప్రోత్సాహంతో బెస్ట్ క్లబ్ గా నిలిచి 2024 సంవత్సరం రోలింగ్ ట్రోఫీని సాధించామన్నారు.9 ఏళ్ల కల సాకారం అయిందని ఇది తమకు చాలా చాలా గర్వంగా ఉందని ,క్లబ్ సెక్రటరీలు, కోశాధికారులు, ఎలైట్ గోల్డెన్ మెంబర్స్, పి డిజిలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత గవర్నర్ రేష్మి ఓలేటి తో పాటు పిడిజిలు వాసవీ క్లబ్ 2 స్టార్ ఎలైట్ చెన్నై , వనిత ఎలైట్ చెన్నై క్లబ్ ల నిర్వాహకులను అభినందించారు.
….
More Stories
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3
பனகல் அரசரின் 96 ஆம் ஆண்டு நினைவு தினம்