January 22, 2025

ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా గోపూజ

చెన్నైన్యూస్:ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో నవంబర్ నెల పౌర్ణమి సందర్భంగా గో పూజలను వైభవంగా నిర్వహించారు. చెన్నై జార్జిటౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మహా మండపం వేదికగా గోపూజను భక్తిశ్రద్ధలతో చేపట్టారు ఆర్యవైశ్య అన్నదాన సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి నేతృత్వంలో ముందుగా గోవులను పసుపు, కుంకుమ,పూలు, వస్త్రాలతో విశేషంగా అలంకరించారు .అనంతరం గోపూజను మహిళలంతా కలిసి సామూహికంగా చేశారు. గోమాతను స్మరిస్తూ స్త్రీలు భక్తి పాటలు శ్రావ్యంగా ఆలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. గో మహత్యం విశిష్టత గురించి మహిళలు వివరించారు .ఈ సందర్భంగా గోమాత ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ భాగ్యలక్ష్మి మాట్లాడారు .ఆర్యవైశ్యులు అంటేనే వ్యాపారాలకు, దానధర్మాలకు పెట్టింది పేరని వ్యాఖ్యానించారు .పూర్వికుల నుంచి వారసత్వంగా ఆర్యవైశ్యులు సమాజ హితం కోసం అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారన్నారు. అదే స్ఫూర్తితో తాము కూడా సమాజం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్య అన్నదాన సభ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆర్యవైశ్యుల సైతం తమకు అండగా నిలిచి తాము చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయ పడాలని పేర్కొన్నారు.మనసున్న దాతలు సహాయం అందించాలంటే భాగ్యలక్ష్మి 99529 83595 ఫోన్ నెంబర్ ను సంప్రదించ గలరని కోరారు. గోపూజలో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాదాలు, పండ్లను పంపిణీ చేశారు.
….

About Author