January 22, 2025

వెల్ కమ్ హోటల్ కెన్సెస్ ఫామ్ బీచ్ లో సందడిగా క్రిస్మస్ కేక్ మిక్సింగ్

చెన్నై న్యూస్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వినియోగదారులకు సంతృప్తికరమైన, రుచికరమైన వంటకాలతో పాటు కేక్ ను అందిం చేందుకు మహాబలిపురంలోని వెల్ కమ్ హోటల్ కెన్సెస్ పాం బీచ్ అధినేత కె.నరసారెడ్డి ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డు లోని ప్రముఖ ప్రాంతమైన మహాబలిపురంలోని హోటల్ ప్రాంగణంలోని సముద్రతీరంలో నూతనంగా ప్రారంభించిన ‘నమ్మ షాక్ బీచ్’ రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం కెన్సెస్ సీఈఓ ఎం. కృష్ణ సారధ్యంలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సందడిగా సాగింది. ఎగ్జిక్యూటివ్ చెఫ్ సబూజ్ పాల్ సహా 30 మంది చెఫ్ లు, సెలబ్రెటీలు ,విదేశీ పర్యాటకులు కలసి పలు రకాల డ్రైఫ్రూట్స్, 35 లీటర్ల వైన్ ,బ్రాందీ , రమ్ తో ఉత్సాహంగా కేక్ మిక్సింగ్ చేశారు. ఈ మిశ్రమాన్ని 30 రోజులు నానబెట్టి క్రిస్మస్ ముందు విదేశీ స్టాయిలో రుచికరమైన కేక్ ను తయారుచేసి హోటల్ కు వచ్చే కస్టమర్లకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ వీరేంద్ర తాపా, హోటల్ సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొని శాంతా క్లాజ్ వేషధారణలో సందడి చేశారు.ఈ సందర్భంగా సీఈఓ ఎం.కృష్ణ మాట్లాడుతూ క్రిస్మస్, 2025 నూతన సంవత్సర వేడుకలను కోలాహలంగా జరుపుకొనేందుకు, కస్టమర్లను ఆకర్షించే రీతిలో సదుపాయాలను భారీస్థాయిలో స్థాయిలో సమకూర్చుతున్నట్టు తెలిపారు.

About Author