చెన్నై న్యూస్ :వైద్యం చేయడం ఆమె వృత్తి అయితే…మానవాతాదృక్పధంతో సమాజానికి సేవ చేయటం ఆమె ప్రవృత్తి.. ఆమె తెలుగు వైద్యురాలు డాక్టర్ సౌజన్య.
ఇటు వైద్యంలో…అటు సమాజ సేవలో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.మరెన్నో అవార్డులు డాక్టర్ సౌజన్య ను వరిస్తున్నాయి..
గత 25 సంవత్సరాల వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ సౌజన్య దుబాయ్ లో అనేస్తిషియా నిపుణురాలుగా ఉన్నారు.అలాగే సర్టిఫైడ్ వాస్తు కన్సల్టెంట్, లైఫ్ కోచ్ ,ఇంకా ఎన్ ఎల్ పి ప్రాక్టీషనర్ కూడా కావటం విశేషం. కోవిడ్ మహమ్మారి సమయంలో డాక్టర్ సౌజన్య తన ప్రాణాలను పణంగా పెట్టి బాధ్యతగా రోగులకు వైద్యం చేసి చేశారు.శ్రామిక శిబిరాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వర్షాలు, వరదలు, తుఫానుల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం వారి సేవా దృక్పథానికి నిదర్శనం. ఆమె సేవకులకు గుర్తింపుగా అత్యుత్తమ పురస్కారాలను, సత్కారాలను డాక్టర్ సౌజన్య అందుకున్నారు.
డాక్టర్ సౌజన్య విజయాలు ,ప్రశంసలు : గల్ఫ్ న్యూస్ అండ్ బీయింగ్ షి 2024 నుంచి ఆరోగ్య విభాగంలో ఎక్స్టెన్స్ అవార్డ్. కోవిడ్ మహమ్మారిలో క్రిటికల్ కేర్ ఫ్రంట్ లైనర్ గా
హెచ్.హెచ్ షేక్ హమదావ్ నుండి ప్రశంసలు దక్కాయి.2017 లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ శస్త్రచికిత్సలో భాగమైన అనస్థీషియాలజిస్ట్, పోస్ట్ ఆపరేటివ్ నొప్పినిపుణురాలిగా అత్యుత్తమ నైపుణ్యం చూపించారు. 2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తెలుగు , కన్నడ మహిళల కోసం వుమెన్ ఎక్స్టెన్స్ అవార్డ్ అందుకున్నారు.
విస్తృత సేవా కార్యక్రమాలు: 2024 యూఏఈ తుఫాన్లు వర్షాలు సమయంలో రైన్ సపోర్ట్ యూఏఈ డాక్టర్స్ ఫేస్ బుక్ పేజీ ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు మహిళల కోసం ” మనమే” ఫేస్ బుక్ పేజీని రూపొందించారు. యూఏఈ తెలుగు వైద్యుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించారు.డిఎన్ఎస్ ఏఐ ఎమిరేట్ ఫేస్ బుక్ వేదికలో భారతీయ మహిళా వైద్యులందరినీ కలిపి స్వాతంత్య్ర్య దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇది పిఎంఓ ఇండియా సహా పలు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు పొందారు. 2024 భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్మిక శిబిరాలకు 500 నిత్యావసర సరుకుల సంచులను పంపిణీ చేశారు. ఐపీఎఫ్ తెలంగాణ కోర్ బృందంతో కలిసి 2024 బతుకమ్మ ఉత్సవాలను దుబాయిలో నిర్వహించారు.
భవిష్యత్ లక్ష్యాలు :ప్రసవ సమయంలో మహిళలకు నొప్పి ఉపశమనం కల్పించడం,క్యాన్సర్ తో బాధపడే పిల్లల కోసం సేవలందిం చడం . జీవిత కోచ్, యుక్తవయస్కులు , తల్లిదండ్రుల న్యూరోలింగ్విస్టిక్ ప్రక్రియలపై దృష్టి సారించి, కుటుంబాలలోసంతోషకరమైన భవిష్యత్తును సృష్టించడంలో సహాయం చేయడం తన భవిష్యత్ లక్ష్యాలుగా డాక్టర్ సౌజన్య వెల్లడించారు.
…
More Stories
ఘనంగా తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్) కార్నివల్ –2025 వేడుకలు
Sundaram Finance Mylapore Festival 2025 to be held from January 9th – 12th
Gyan Babu and Senait Kefelegn win the Freshworks Chennai Men’s and Women’s Full Marathon 2025 powered by Chennai Runners