January 22, 2025

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఖ్యాతిని మరింత పెంచుతాం -కె ఎం కొండయ్య టి టి ఆర్

చెన్నై న్యూస్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఖ్యాతిని మరింతగా పెంచుతామని డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు K.M. కొండయ్య T T R అన్నారు.ఈమేరకు డాక్టర్ ఎస్.పి. బాలసుబ్రమణ్యం కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువ గాయనీ గాయకులను ప్రోత్సహించే విధంగా డాక్టర్ ఎస్పీబీ మ్యూజికల్ కాన్సెర్ట్ ను కొత్తగా ప్రారంభించారు. చెన్నై ఐనావరం లోని జీజీ రిహార్సల్ స్టూడియో వేదికగా ఈ నెల 8వ తేదీ ఆదివారం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎం కొండయ్య టీటీఆర్ నేతృత్వంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న గాయకులు గాయకులు చార్లెస్ రవి, ప్రముఖ తమిళ దర్శకులు జిప్సీ రాజ్ కుమార్, పెన్ కుయిల్ అడ్మిన్ రాజారమణిల చేతుల మీదుగా డాక్టర్ ఎస్పీబీ మ్యూజికల్ కాన్సెర్ట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కె ఎం కొండయ్య టీటీఆర్ మాట్లాడుతూ తెలుగు, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో గాయనీగాయకులకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. తమ ఎస్పీబీ మ్యూజికల్ కాన్సర్ట్ తో ఎస్పీబీ ఖ్యాతిని మరింత పెంచుతామని తెలిపారు.అనంతరం గాయకులు ,సామాజిక సేవకులు చార్లెస్ రవి మాట్లాడుతూ ఎస్పి బాలసుబ్రమణ్యం అందరివాడని అన్నారు. ప్రత్యేకించి తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకుని వచ్చారన్నారు. తమిళంలోనూ ఆయన పాడిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయని అన్నారు. తన పాటలతో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఖ్యాతి గడించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత చరిత్రలో చిరస్మరణీయులని అని అభిప్రాయ పడ్డాడు.

ఎస్పీబి పేరుతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అలాగే కాన్సర్ట్ ను ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకుల అభినందించారు. ముందుగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి Y.A. విలియమ్స్ డాక్టర్ ఎస్పీబి మ్యూజికల్ కాన్సెర్ట్ గురించి వివరించారు. ఈ కాన్సర్ట్ ద్వారా వచ్చే మొత్తంలో 90 శాతం సమాజ సేవకు వినియోగిస్తామని యువ గాయనీ గాయకులను ప్రోత్సహించేందుకు కూడా ఉపయోగిస్తామని తెలిపారు. ఇందులో ట్రస్ట్ కోశాధికారి కె. బాలాజీ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు. చివరిగా పలువురు గాయనీ గాయకులు పాల్గొని ఎస్పీబి పాటలతో ఆధ్యంతం అలరించారు. జిజి స్టూడియో అధినేత జి. గోపినాథ్ ,సభ్యులు కృష్ణ వేణి, డి. రమేష్, శివ యశోధ,వరధరాజన్, అజయ్ కుమార్, ఆనందన్, రాజలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

About Author