December 25, 2024

ఘనంగా నరసింహ నగర్ కెనాల్ తెలుగు బాప్టిస్టు సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్: ఆత్మరక్షణ
కలిగి పరిశుద్ధ జీవితాన్ని
జీవించాలని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చి కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్. రాజేంద్రప్రసాద్ ఉపదేశించారు .చెన్నై పులియన్ తోప్, నరసింహ నగర్ కెనాల్ తెలుగు బాప్టిస్టు సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఆసియా బాప్టిస్టు కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్. ఎస్ ప్రకాశ్ రాజ్ దైవసందేశం అందించారు. అబద్ధపు మాటలను మాట్లాడ కూడదు, చెప్పకూడదని హితవు పలికారు.క్రీస్తు అనుసరించిన మార్గం నడవాలని అన్నారు.అనంతరం నరసింహనగర్ కెనాల్ తెలుగు బాప్టిస్టు సంఘ కాపరి రెవరెండ్ వి.యేసుదాసు సంఘం తరుపున చేపడుతున్న సామాజిక, ఆధ్యాత్మాక సేవల గురించి వివరించారు. సంఘ అధ్యక్షుడు పీకే బాబు కొండయ్య చర్చి కోసం సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. సంఘ కార్యదర్శి గంగేపోగు బాబూ రావు, కోశాధికారి G.షడ్రక్, సంఘ పెద్దలు, సండే స్కూల్ చిన్నారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్త్రీల సమాజం సభ్యులు క్రిస్మస్ ను ఆహ్వానిస్తూ క్రైస్తవ గీతాలను ఆలాపించారు.అందరికీ ప్రేమవిందును అందించారు.

About Author