January 5, 2025

సేవే పరమావధిగా సమాజానికి సేవ చేయండి..వాసవీ క్లబ్ లకు సుజాత రమేష్ బాబు పిలుపు

చెన్నై న్యూస్:సేవలో ఉన్న ఆత్మ సంతృప్తి మరెందులోనూ దొరకదని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ (VCI) ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు అన్నారు. సేవే పరమావధిగా ప్రతీ ఒక్క వానవీయన్ ముందుకెళ్ళాలని ఆమె పిలుపునిచ్చారు .వాసవీ క్లబ్ టు స్టార్ KCGF ఎలైట్ చెన్నై, వనిత ఎలైట్ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం, స్కాలర్షిప్ ల పంపిణీ, ఉచిత డయాబెటిస్ డిటెక్షన్ వైద్యశిబిరాల కార్యక్రమాలను జనవరి1 బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎలైట్ చెన్నై నూతన అధ్యక్షులు డాక్టర్ ఎస్ రమేష్ బాబు అధ్యక్షతన చెన్నై ప్యారీస్ లోని శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానంలో గోపూజ ,వాసవీ అమ్మవారికి అభిషేకం, అలంకార పూజలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సుజాత రమేష్ బాబు తోపాటు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవీ నారాయణ గుప్తాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన కమిటీ సేవే పరమావధిగా పనిచేయాలని, మంచి ప్రాజెక్టులతో నమాజానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా బీ.కామ్ చదువుతున్న పేద విద్యార్థినికి ఎలైట్ చెన్నై క్లబ్ తరపున ఉపకార వేతనం అందించారు . ముందుగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ రానున్న ఏడాది కాలం పాటు చేపట్టనున్న సేవా కార్యక్రమాలను సభకు వివరించారు. ఇందులో వాసవీ క్లబ్ 2 స్టార్ ఎలైట్ చెన్నై సెక్రటరీ మన్నారు ఉదయ్ కుమార్, కోశాధికారి గీతా ప్రసాద్, వనిత ఎలైట్ చెన్నై అధ్యక్షురాలు జోష్న , సెక్రటరీ విశాలక్ష్మీ,, కోశాధికారి జ్యోతిప్రసాద్ ఏర్పాట్లు ను పర్యవేక్షించారు.ఇందులో ఇంకా జెమిని టింబర్ అధినేత సుబ్బారావు,రాధాకృష్ణ, వాసవీ క్లబ్ టు స్టార్ KCGF ఎలైట్ చెన్నై , వనిత ఎలైట్ చెన్నై నుంచి70 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.
..
..

About Author