January 6, 2025

జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరపాండ్య కట్టబొమ్మన్ -ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి.

చెన్నైన్యూస్: జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు వీరపాండ్య కట్టబొమ్మన్ అని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సి ఎం కె రెడ్డి కొనియాడారు.అఖిల భారత తెలుగు సమాఖ్య (AITF) ఆధ్వర్యంలో తొలి స్వాతంత్ర్య సమరయోధుడు వీరపాండ్య కట్టబొమ్మన్ 266వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నై గిండి లోని గాంధీ మండపం ప్రాంగణంలో ఉన్న వీరపాండ్య కట్టబొమ్మన్ శిలా విగ్రహానికి డాక్టర్ సిఎంకే రెడ్డి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 39 ఏళ్ల వయస్సులోనే తెల్లదొరలను ఎదిరించిన మహాయోధుడు వీర పాండ్య కట్టబొమ్మన్ అన్నారు. ఆంగ్లేయులకు సింహ స్వప్నంగా నిలిచి దేశం కోసం ప్రాణాలర్పించిన వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని అభిప్రాయపడ్డారు.గాంధీ మండపంలో కట్టబొమ్మన్ శిలా విగ్రహం ప్రతిష్టించారు కానీ తగిన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కోరారు .ఈ కార్యక్రమంలో ఏఐటిఎఫ్ ప్రధాన కార్యదర్శి R. నందగోపాల్ , ఉపాధ్యక్షులు సీఎం కిషోర్, V.G. జయకుమార్, కోశాధికారి K.V.. జనార్దనం, నాగభూషణం, నాగేంద్ర , తిరునెల్వేల్లి రామసుబ్బు, వీరపాండ్య కట్టబొమ్మన్ వంశస్తులు ఇళయా కట్టబొమ్మన్, వంజరపు శివయ్య,నామ్ తెలుంగర్ పార్టీ కట్టబొమ్మన్ జమిందార్,
నాయుడు వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణమూర్తి, ముని ఆరుముగం, గజేంద్ర బాబు,భజంగ రావు, మనోహరన్, కందవేల్ తదితరులు పాల్గొని నివాళ్లు అర్పించి , కట్టబొమ్మన్ సేవలు చిరస్మరణీయం అని వ్యాఖ్యానించారు.

About Author