January 8, 2025

ఘనంగా తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్‌) కార్నివల్‌ –2025 వేడుకలు

చెన్నై న్యూస్:తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్‌) కార్నివల్‌ –2025 వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు చెన్నై చేట్‌పేట్‌లోని కుచలంబాల్‌ కల్యాణమండపం వేదికైంది. తమిళనాడు ఆర్యవైశ్య మహిళాసభ ఛైర్‌పర్సన్‌ అనిత రమేష్‌ అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా భరతనాట్యకారిణి లావణ్య వేణుగోపాల్‌ విచ్చేసి మహిళా సభ్యులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్నివల్‌ ను వైభవంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా సమాజానికి మహిళ సభ సేవ చేయటం నిజంగా అభినందనీయం అన్నారు .ప్రస్తుతం వారివారి రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.ముందుగా అనిత రమేష్‌ స్వాగతోపన్యాసం చేస్తూ మహిళా సభ చేస్తున్న సేవలను సభకు వివరించారు.


వార్షిక నివేదికను శృతి సంతోష్‌ చేయగా , వందన సమర్పణను వైస్‌ఛైర్‌పర్సన్‌ మల్లికా ప్రకాష్‌ గావించారు. . కర్నివాల్ లో భాగంగా పురాతన కళా ప్రదర్శనలతో పాటు కరాటే ప్రదర్శన , శ్లోకాల పోటీలు, ఆధ్యాత్మిక క్విజ్‌ , తంబోలా పోటీలు ఆకట్టుకోగా, స్వరార్ణవ నిర్వాహకులు జ్యోసుల ఉమా , శేలేష్‌లు రూపొందించిన ఇంటింటి రామయణం హాస్య నాటికను స్వరార్ణవ సభ్యులు రంజనీ ,నీరజ ,మల్లిక ,ప్రీతలు ప్రదర్శించి ఆధ్యంతం అందరినీ ఆహ్లాదపరిచింది. అలాగే విద్యాలో ప్రతిభను చాటుకుంటున్న పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. గీతా మందిరానికి, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వేల్ఫేర్‌ కు ,గుండె సమస్యతోభాధపడుతున్న ఒక వ్యక్తికి , ఇంకా శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో బంగారు రథం తయారీ కోసం తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ తరపున రూ.25,000 చెక్కును , అలాగే మహిళా సభ సభ్యులు అయిన అనిత , ప్రీత ,మల్లికా ,నీరజ , వసుంధరలు కలసి 7 గ్రాముల బంగారును కానుకగా ఆ ఆలయ ట్రస్టీలకు అందజేశారు . ఈ కార్యక్రమంలో మహిళా సభ కోశాధికారి వసుందర సుంకు , అలాగే పద్మప్రీతా , ఇంకా సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్నివల్‌ను విజయవంతం చేశారు .

About Author