Chennai : చెన్నై పెరియమేట్ లోని ఎస్. కె. పి. డి అండ్ చారిటీస్ యాజమాూన్యంలో కొనసాగుతున్న ఎస్ కె పి.డి- మహర్షి విద్యా మందిర్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు.ఈ నెల 11వ తేదీ, శనివారం మహర్షి విద్యా మందిర్ ప్రాంగణంలో ఏర్పాటు అయిన ఈ సంక్రాంతి సంబరాలు పాఠశాల కరస్పాండెంట్ టివి రామ కుమార్ సారథ్యంలో సాగాయి.విద్యార్థులు, ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో సంప్రదాయ వస్త్రదారణలో విచ్చేసి కనువిందు చేశారు. ముందుగా కొత్త కుండల్లో పొంగళ్లను పొంగించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇందులో మహర్షి విద్యా మందిర్ ప్రిన్సిపల్ సుబ్రమణ్యం, వైస్ ప్రిన్సిపల్ కవిత , పాఠశాల మేనేజర్ శ్రీలత, ఎస్ కె పి డి ట్రస్టీలు దేసు లక్ష్మీనారాయణ, ఎస్ ఎల్ సుందర్శనం పాల్గొని కర్పూర హారతులు పట్టి పూజలను గావించారు. అనంతరం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సంబరాల సందర్భంగా పాఠశాల విద్యార్థిని ,విద్యార్థులు పలు రాష్ట్రాల సంస్కృతులను తెలియజేస్తూ ఆటపాటలతో అలరించారు. కోలాట నృత్యాలు, జానపద నృత్యాలు, తెలుగు ,తమిళ సంస్కృతులకు అద్దంపట్టేలా చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
More Stories
తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు
தைப்பொங்கல் திருநாளை முன்னிட்டு 915 அணிகள் பங்கேற்ற மாபெரும் கோலப்போட்டி