చెన్నై న్యూస్: ఓ వైపు కోలాట నృత్యాలు, హరిదాసు పాటలు,గంగిరెద్దుల విన్యాసాలు,సంప్రదాయ క్రీడలు ,మరో వైపు ముగ్గుల పోటీలు,వంటల పోటీలు, పొంగళ్లు పొంగించటం,ఇంకో వైపు శ్రీ కోదండ రామాలయంలో విశేష పూజలు వెరసి ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా చిన్నా ,పెద్దా అంతా సంప్రదాయ వస్త్రధారణలో విచ్చేసి సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుని ఆహ్లాదకరంగా గడిపారు .
చెన్నై కొరట్టూర్ అగ్రహారంలోని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఆదివారం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలతో,చెరకు గడలతో,ముగ్గులతో శోభాయమానంగా అలంకరించి వేడుకలను ఆరంభించారు. అనంతరం కొత్త మట్టికుండల్లో పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యంసమర్పించారు.కోదండ రాముడిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులను పొందుకున్నారు .వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, వంటలు పోటీలు నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు .
అలాగే చెన్నై నుంగంబాక్కంలోని శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ ప్రదర్శించిన నాటిక, కోలాట నృత్యాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి .ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు , కార్యదర్శి జె. శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, సలహాదారులు ఎమ్ ఎస్ మూర్తి, ఉపాధ్యక్షులు కేఎన్ సురేష్ బాబు ,వి ఎన్ హరినాధ్, సరస్వతి,ఇంకా ఎం ఎస్ నాయుడు, ఓ. మనోహర్, ఈ .బాలాజీ, సురేంద్ర సహా కార్యవర్గ సభ్యులు, మహిళ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గులు, వంటల పోటీల విజేతలకు బహుమతులను 4పి ఇంటర్నేషనల్ బెల్లంకొండ బ్రదర్స్ తరపున సిల్వర్ కాయిన్ లు, అలాగే పోటీల్లో పాల్గొన్న వారికి , న్యాయ నిర్ణేతలకు , పాఠశాల ఉపాధ్యాయులకు ఐఎస్ పి గ్రూప్ తరపున ఆయిల్ ప్యాకెట్లు బహమతులుగా అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లోన్యాయనిర్ణేతలుగా శేషా రత్నం, అన్నపూర్ణ ,రాధిక, కల్పన , ఇందుమతి , అలాగే క్రీడా పోటీలకు అల్ ఇండియా రేడియో గజగౌరి, స్రవంతి ఉపాధ్యక్షులు వి ఎన్ హరినాధ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర కళా స్రవంతి తరపున తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.దాదాపు 300 మందికి సంక్రాంతి విందును అందించారు.
..
…
More Stories
తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్
தைப்பொங்கல் திருநாளை முன்னிட்டு 915 அணிகள் பங்கேற்ற மாபெரும் கோலப்போட்டி
ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని సాధన చేస్తే విజయం తథ్యం-ప్రముఖ ఆర్థో డెంటిస్ట్ డాక్టర్ ఎం ఎస్ రాణి