January 15, 2025

తెలుగు వెలుగు తరపున సంక్రాంతి కానుకలు అందజేసిన అల్లింగం రాజశేఖర్

చెన్నై న్యూస్:చెన్నై నగరానికి చెందిన తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.సంక్రాంతిని పురస్కరించుకుని చెన్నైనగరంలోని విల్లివాక్కం, పెరంబూరు, మాధవరం ప్రాంతాలలో నివసిస్తున్న పేద తెలుగు ప్రజల ఇంటి ఇంటికి వెళ్లి మరీ నిత్యవసర సరుకులతోపాటు నూతన వస్త్రాలను, దుపట్లను సంక్రాంతి కానుకలుగా వితరణ చేశారు.ప్రతీ ఒక్కరూ ఆనందంతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలన్న కాంక్షతో తెలుగు వెలుగు సంక్షేమ సంఘం తరపున అల్లింగం రాజశేఖర్ పేదలకు ఈ సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ అని ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు . వచ్చే టప్పుడు ఏమీ తీసుకుని రాము, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళాము అని అందువల్ల తోటివారికి సహాయపడుతూ ముందుకుసాగాలి అని అభిప్రాయ పడ్డారు.ఆంధ్రా నుంచి వలస వచ్చిన విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన భవననిర్మాణ కూలీలకు తెలుగు వెలుగు సంస్థ తరపున సాయం అందించామని తెలిపారు.ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాక్షాంక్షలు తెలియజేశారు.

About Author