January 16, 2025

వైభవంగా ఆర్యవైశ్య అన్నదాన సభ 15వ వార్షికోత్సవ వేడుకలు

చెన్నై న్యూస్:ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ వస్తున్న ఆర్యవైశ్య అన్నదాన సభ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఆర్యవైశ్య అన్నదాన సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన ఈ వేడుకలకు చెన్నై జార్జ్ టౌన్ లోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం వేదికైంది.ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం గోశాలలో గోమాతకు విశేష పూజలను నిర్వహించి గోమాత సేవలో తరించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ మహా మండపంలో దాదాపు 60 మంది మహిళలతో లలిత సహస్రనామ పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమంలో ఆర్యవైశ్య అన్నదాన సభ సభ్యులతో పాటు సునాధ వినోదిని బృందం,లలిత సహస్రనామ మండలి గ్రూప్ -విల్లివాక్కం, కృష్ణవేణి బృందం వారు కూడా పాల్గొని సామూహిక పారాయణ చేసి వాసవీ అమ్మవారిని వేడుకున్నారు. వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ అన్న ప్రసాదాలను అందించారు .ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ సభ 15 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎలా సంతోషంగా ఉందని అన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళుతున్న తమకు పలువురు దాతలు సహకరిస్తున్నారని వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు .మరింతగా ఈ ఆధ్యాత్మిక సేవ చేసేందుకు మరింతమంది దాతలు సహకరించి సహాయపడాలని కోరారు . 15వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుపుకునేందుకు అనుమతించిన ఆలయ ధర్మకర్తకు, ట్రస్టీలకు, సెక్రటరీకి, అలాగే వేదపండితులకు ,సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు .ఆర్యవైశ్య అన్నదాన సభ తరపున ప్రతి నెల అమావాస్య రోజున గీతా మందిరంలో సునాధ వినోదిని బృందం చేత ఆధ్యాత్మిక భక్తి గీతాలాపన, అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ కన్యకా పరమేశ్వరి గోశాలలో గోమాతను వేడుకుంటూ గోపూజ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు ఇదే విధంగా ప్రతినెలా కొనసాగుతాయని తెలిపారు. గోమాత లోకమాత అని ప్రతి ఒక్కరూ గోమాత సేవలో తరించాలని ఆకాంక్షించారు.ఈ వార్షికోత్సవ సందర్భంగా ఇటీవల వైకుంఠ ఏకాదశి రోజున పార్థసారథి స్వామి ఆలయం వద్ద, అలాగే సంక్రాంతి పండుగ రోజున పేదలకు టవళ్లు దుప్పట్లను వితరణ చేసి అల్పాహారం అందించామని వెల్లడించారు. ఆర్యవైశ్య అన్నదాన సభకు దాతలు సహకరించాలి అని అనుకుంటే సభ నిర్వహకురాలు భాగ్యలక్ష్మి
99529 83595 అనే ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరని కోరారు.
….
..

About Author