
చెన్నై న్యూస్: పవర్ ఫుల్ ఫైట్‌లతో ,థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తెలుగులోనూ రిలీజవుతుండటంతో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU )లో ఆరవ భాగం. లెజెండరీ నటుడు హారిసన్ ఫోర్డ్ పోషించిన రెడ్ హల్క్ పాత్రను పరిచయం చేయడంతో ఈ సినిమా ఈసారి ఏమి చూపబోతుందో చూడటానికి అభిమానులు ఉత్సాహంగా , ఆతృతగా ఉన్నారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ,తమిళంతో పాటు తెలుగు భాషలలో విడుదల అవుతుండటం విశేషం.
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రీకరణ సమయంలో ఎం సి యు లోకి (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) అడుగుపెడు తున్నప్పుడు తన అనుభవాన్ని పంచుకుంటూ, ఫోర్డ్ తన పాత్ర పవర్ ఫుల్ డైనమిక్స్‌తో పాటు రాజకీయ కుట్రలో మునిగిపోవడం గురించి వివరించారు అవును, దీనికి చాలా పొలిటికల్ థ్రిల్లర్ అంశం ఉంది, కొన్ని అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి. బలమైన భావోద్వేగ పాత్ర కథ కూడా ఉంది. మార్వెల్ పాత్రలు ఖచ్చితంగా వారి వ్యక్తిత్వాలకు చెందిన ఆసక్తికరమైన అంశాలను కలిగి ఉంటాయి, అధ్యక్షుడి పాత్రలో నేను వెతుకుతున్నది భావోద్వేగ వాస్తవికత, చుట్టూ జరుగుతున్న అన్ని అద్భుతమైన విషయాలకు కొంత మానవ ప్రవర్తన మరియు సందర్భాన్ని అందిస్తుందని అన్నారు. జూలియస్ ఓనా దర్శకత్వం వహించిన కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్, ఆంథోనీ మాకీ, హారిసన్ ఫోర్డ్, డానీ రామిరేజ్, షిరా హాస్, జోషా రోక్మోర్, కార్ల్ లంబ్లీ, లివ్ టైలర్, టిమ్ బ్లేక్ నెల్సన్ నటించారు.
….
More Stories
మార్వెల్ హీరోస్ సౌత్ ఇండియన్ స్టార్స్‌ను కలిసినప్పుడు: ఎ బాటిల్ ఆఫ్ పవర్ అండ్ స్టైల్
Ultraviolette solidifies presence across South India with the launch of their new Experience Center in Chennai
పారామౌంట్ పిక్చర్స్ సమర్పణలో గ్లాడియేటర్ 2