March 12, 2025

అమ్మకు ” వంద”నం : ఘనంగా ఆర్ .సరస్వతమ్మ 100వ పుట్టిన రోజు వేడుకలు

చెన్నైన్యూస్: మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల మనస్తత్వాలు మారుతున్న నేటి రోజుల్లో ఓ మాతృమూర్తికి వందేళ్ల పుట్టిన రోజు వేడుకలు ఘనంగాజరిపి అమ్మప్రేమకు ఆదర్శంగా నిలిచింది ఓ తెలుగు కుటుంబం.ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని మాతృమూర్తి ఆశీర్వాధాలు పొందారు. ఈ మాతృమూర్తి సరస్వతమ్మ అక్షరాల వందఏళ్లు పూర్తి చేసుకుంది. చెన్నై నగరంలోని షావుకారు పేట నాట్టుపిల్లయార్‌ కోయిల్‌ ప్రాంతంకి చెందిన సరస్వతమ్మ జన్మించి వంద సంవత్సరాలు నిండటంతో ఆమె కుటుంబ సభ్యులు 100వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం రాత్రి చెన్నై జార్జిటౌన్‌లోని ఎస్‌కెపి కన్వేన్షన్‌ హాలులో ఎంతో ఘనంగా నిర్వహించారు. సరస్వతమ్మ కి ఐదుగురు సంతానంలో నలుగురు కొడుకులు , ఒక కుమార్తె కాగా,ఇందులో ఇద్దరు కుమారులు కాలం చెందారు. కుమారులు శ్రీహరి (వ్యాపారవేత్త ), అమరనాధ్‌ (ఆర్కిటెక్చర్‌) , కుమార్తె శ్రీరంగాలు ఉన్నారు.

ఐదు తరాలకు పెద్దదిక్కుగా ఉన్న సరస్వతమ్మకు కుమారులు , కుమార్తెలు , మనవళ్ళు ,మునిమనవళ్లు కలపి 50మందికి పెద్ద దిక్కు.. వందేళ్ల క్రితం పుట్టిన సరస్వతమ్మ తమ పిల్లలందరిని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసింది. అమ్మ చలువతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు ఆమె కుమారులు. వృద్దాప్యం చేరుకున్న తల్లిదండ్రులను ఎవరూ దూరం చేసుకోవద్దని నేటి తరానికి ఈ సందర్భంగా సూచిస్తున్నారు. సరస్వతమ్మ ఆనాటి నుంచి నేటి వరకు తింటున్న ఆహారపు అలవాట్లతోనే ఇంతయాక్టీవ్‌ గా ఉందంటున్నారని వారి కుమారులు చెపుతున్నారు.ఎవరిపై ఆధారపడకుండా తనపని తాను చేసుకుంటూ అందరికి మార్గదర్శంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. సరస్వతమ్మ వందో పుట్టిన రోజు వేడుకలకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఎంతో అల్లారుముద్దుగా కనిపెంచిన తల్లిదండ్రులను వయస్సుపైబడగానే వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న వారు సరస్వతమ్మ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ వేడుకల్లో మన్నారు ఉదయ్ కుమార్ తోపాటు తెలుగు ప్రముఖులు పాల్గొని సరస్వతమ్మ ఆశీస్సులు పొందుకున్నారు.

About Author