March 13, 2025

మాతృభాష విరాజిల్లాలన్నదే నా ఆశయం :అల్లింగం రాజశేఖర్

చెన్నై న్యూస్ : మాతృభాష విరాజిల్లాలన్నదే నా ఆశయం అని తెలుగు వెలుగు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ అన్నారు.ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్‌ V.L .ఇందిరాదత్‌ నిర్వహిస్తున్న చెన్నై తిరువోత్తియూర్‌లో ఉన్న శ్రీ రామకృష్ణా ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు పోటీలను తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.

తెలుగు వెలుగు అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో చిన్నారులకు వేమన పద్యాల పోటీ , సైన్స్‌ ప్రశ్నావళి పోటీలను నిర్వహించగా , చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పద్యాలతో ఆలరించగా , సైన్స్‌ ప్రశ్నావళిలోనూ ప్రతిభను చాటుకున్నారు .చిన్నారులు మా తెలుగుతల్లికి మల్లెపూదండ ప్రార్థనాగీతంతో పోటీలు ఆరంభించారు.ముందుగా స్కూల్‌ ఉపాధ్యాయురాలు బి. శ్వేతకు పార్వతీ పరమేశ్వరుని పోటోని బహుకరించి ఘనంగా సత్కరించారు.విజేతలుగా నిలిచిన వారికి బహుమతులతోపాటు పాఠశాలోని ప్రతీ విద్యార్థికి కథలు పుస్తకాలు , స్వీట్లు పంచిపెట్టారు.అనంతరం అల్లింగం రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఎదుగుదలకు కారణమైన అమ్మానాన్నలను, విద్యను నేర్పిన గురువులను మారువరాదని హితవుపలికారు. మాతృభాషలోనే చదువుకుని ఆ భాష అమృతాన్ని పదిమందికి పంచాలని సూచించారు. తెలుగు నేలలో పుట్టి , తెలుగు జీవం పొంది ,తెలుగు తేజంగా ఎదిగిన ప్రతీ విద్యార్థి ఒక తెలుగోడుగా ఈ మహా విశ్వంలో మాతృభాష విరాజిల్లాలన్నదే నా ఆశయం అని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు అపర్ణ , విద్యార్థులు పాల్గొన్నారు .
.

About Author