April 3, 2025

టామ్స్ సౌత్ చెన్నై జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు

చెన్నై:తమిళనాడు ఆది ఆంధ్ర అరుంథతీయ మహాసభ (టామ్స్‌) సౌత్‌ చెన్నై ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి మైలై బాలాజీ నగర్‌లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఈనెల 30 వతేది ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. టామ్స్‌ సౌత్‌ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్‌ ఆధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా 188వ డివిజన్‌ కార్యదర్శి వి. రంజిత్ కుమార్‌ ,188వ డివిజన్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ సమీనా సెల్వం పాల్గొని వేడుకలను ఘనంగా ప్రారంబించారు .ఈసందర్బంగా వారు తెలుగు ప్రజలందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే ఈ ఉగాది వేడుకలకు విశిష్ట అతిథిగా టామ్స్‌ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేల్‌ పాల్గొని ఉగాది విశిష్టతను తెలియజేశారు . ప్రతీ ఏడాది ఒక్కో పేరుతో తెలుగు నూతన సంవత్సరం ఆరంభం ఆవుతుందని అన్నారు.ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం అని ఈ ఏడాదంతా ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురా రోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు .వ్యయప్రయాసాలకు ఓర్చి ప్రముఖ పండుగలను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న రోడ్డా జయరాజ్‌ గారితోపాటు స్థానిక ప్రజలను ,యువతను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా టామ్స్‌ కు చెందిన ప్రసన్న కుమార్‌ ,దుడ్డు రమేష్‌లు కూడా విచ్చేశారు .ఈ కార్యక్రమంలో మైలై బాలాజీ నగర్‌ ప్రెసిడెంట్‌ బి. పెంచలయ్య, సెక్రటరీ సిహెచ్‌ తిరుపాలు, కోశాధికారి ఆర్‌ . సుబ్రమణి , ఉపాధ్యక్షులు టి. సుబ్బయ్య ,ఉపకార్యదర్శి ఈ. దేవదాసు ,ఉపకోశాధికారి ఎన్‌ విజయ్‌కుమార్‌ , సలహాదారు కె .వెంకటరమణయ్య , వై .ఆరోగ్యదాస్‌ ,జి. హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు .ఉగాది సందర్భంగా చిన్నారులు వివిద పోటీలు నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేసి అభినందించారు .అలాగే మహిళలకు చీరలను వితరణ చేశారు.

About Author