April 26, 2025

యాక్షన్ ప్రియులకు గుడ్ న్యూస్…మే 17న మిషన్: ఇంపాసిబుల్ విడుదల

చెన్నై న్యూస్ : హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన మిషన్: ఇంపాసిబుల్ భారతదేశంలో మే 17, 2025న విడుదల కానుంది. పారామౌంట్ పిక్చర్స్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ,యాక్షన్ ప్రియులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. పారామౌంట్ పిక్చర్స్ అండ్ స్కైడాన్స్ టామ్ క్రూజ్ ప్రొడక్షన్‌లో క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన “మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్” రూపుదిద్దుకుంది. ఇందులో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, ఎసై మోరల్స్, పోమ్ క్లెమెంటిఫ్, హెన్రీ క్జెర్నీ, ఏంజెలా బాసెట్, హోల్ట్ మెక్‌కాలనీ, జానెట్ మెక్‌టీర్, నిక్ ఆఫర్‌మాన్, హన్నా వాడింగ్‌హామ్, ట్రామెల్ టిల్‌మాన్, షియా విఘం, గ్రెగ్ టార్జాన్ డేవిస్, చార్లెస్ పార్నెల్, మార్క్ గాటిస్, రోల్ఫ్ సాక్సన్ మరియు లూసీ తులుగార్జుక్ నటించారు.

మిషన్ :ఇంపాసిబుల్ – ది ఫైనల్ రికనింగ్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.మే 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించారు.అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు చెప్పారు. మే17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది .దీంతో విభిన్న ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండండి!

About Author