
చెన్నై న్యూస్: అంకిత భావంతో చదివి ప్రతిభావంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు బంగారు భవిత సొంతమవుతుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రేమ్ ఫార్మా గ్రూప్ కంపెనీల మేనేజింగ్ పార్ట్నర్ బి ఎల్ కుమార వేల్ సూచించారు .చెన్నై జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వైశ్య సంఘం నిర్వహణలోని వాసవి విద్యానిధి ఆధ్వర్యంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
సంఘం అధ్యక్షులు డాక్టర్ కనిగెలుపుల శంకర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి ఎల్ కుమార వేల్ పాల్గొన్నారు. ఒక్కొక్కరికి రూ.1,000 ల చొప్పున వంద మందికి పైగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించారు. అలాగే నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరి విద్యార్థులతో పాటు ఉపకార వేతనం కోసం రూ.1లక్ష విరాళం అందించిన ఉప్పు జయ చంద్రన్ ను సభలో సంఘం తరపున సత్కరించారు. అజంతా డాక్టర్ కే.శంకర రావు మాట్లాడుతూ అసోసియేషన్ తరపున గత నాలుగు దశాబ్దాలుగా నాలుగు సేవా పథకాలను దాతలు , శ్రేయోభిలాషులు , సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న బి ఎల్ కుమార వేల్ మాట్లాడుతూ విద్యతోనే భవిత బాగుంటుందన్నారు.కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అసోసియేషన్
సంయుక్త కార్యదర్శి ఎం నరసింహులు స్వాగతంలో 42వ వార్షిక ఉపకార వేతనాలను అందించినట్టు వెల్లడించారు. అసోసియేషన్ కోశాధికారి పెసల రమేష్ వందన సమర్పణ గావించుగా, ఉపాధ్యక్షులు ఎం ఉదయ్ కుమార్, జి పి వి సుబ్బారావు, వాసవీ విద్యనిధి కార్యదర్శి ఎం .ప్రవీణ్ కుమార్ లతోపాటు సభ్యులు పెద్ద సంఖ్యల విచ్చేశారు. సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కె కె త్రినాధ్, సభ్యులు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు మధ్యాహ్నం భోజనం అందించారు.
…


More Stories
பல்லாவரத்தில் அதிமுகவினர் இடையே கோஷ்டி மோததால் பரப்பரப்பு.
JVS ARUMUGAM Submits Expression of Interest to Contest from Nellithope Constituency
மக்களின் சிரமங்களை தென்னக ரயில்வே துறை பொருட் படுத்தவில்லை- எஸ் ஆர் எம் யூ பொதுச் செயலாளர் கண்ணையா தெரிவித்துள்ளார்.