March 7, 2026

ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ (వామ్) మినీ బజార్ కు అనూహ్య స్పందన

చెన్నైన్యూస్:ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్రేటర్ చెన్నై విభాగం , తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మినీ బజారు కు అనూహ్య స్పందన లభించింది.దీనికి చెన్నై చూలైమేడు, గిల్ నగర్ ఎక్స్టెన్షన్ స్ట్రీట్ లో గల శ్రీహరినిలయం వేదికైంది. ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకుఈ మినీ బజార్ సాగింది. ఈ సందర్భంగా వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలను పోత్సహిచడమే కాకుండా, స్వయం కృషితో ఎదుగుతున్న వ్యాపారులను ప్రోత్సహించటం దీంతో పాటు మధ్య
తరగతి కుటుంబాలకు అవకాశం కల్పించడమే ఈ మినీ బజార్ ప్రధానోద్దేశం అని తెలిపారు .ఈ మినీ బజార్లో చేనేత వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, భారతదేశంలో ప్రాముఖ్యత చెందిన టియారా జ్యువెలరీ -గుంటూరు వారు సైతం పాల్గొని భారీ ఎత్తున 9 క్యారెట్స్ నుంచి 21 క్యారెట్స్ వరకు ఆభరణాలను ప్రదర్శనలో కొలువుదీర్చారు. మినీ. బజార్ కి వచ్చే సందర్శకులకు సిల్వర్ నుంచి డైమండ్ ఐటమ్స్ వరకు ప్రతి అరగంటకు ఒక లక్కిడిప్ అందజేసినట్టు తెలిపారు ఇందులో చెన్నై ఎక్స్ ప్రెస్ ఉద్దిపప్పు ప్యాకెట్, బెల్లం , సోయావిటా, పర్చేజె పాయింట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే కోటాక్ బ్యాండ్, రియల్ ఎస్టేట్ వాళ్లు సైతం స్టాల్స్ అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామ్ కి చెందిన సాయి చందన్, శ్రీహరి, బెల్లంకొండ సాంబశివరావు కేకే త్రినాథ్ కుమార్, తాడేపల్లి రాజశేఖర్, సుజాత రమేష్ బాబు, వి ఎన్ హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.

About Author