March 7, 2026

శ్రీ వాసవీ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో వైభవంగా కోధై నాచియార్ వైభవ పూజ

చెన్నై న్యూస్: చెన్నైకు చెందిన శ్రీ వాసవీ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో కోధై నాచియార్ (గోదాదేవి) వైభవ పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు.గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆడిపూరం సందర్భంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలను శ్రీ వాసవీ మహిళా విభాగ్ అధ్యక్షురాలు టి. లావణ్య అధ్యక్షతన నిర్వహించారు. చెన్నై జార్జిటౌన్ ప్రాంతంలోని ఆదియప్పనాయకన్ వీధిలో వెలసియున్న శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చేపట్టిన ఈ ఆండాల్ పూజలో వివిధ రకాల పుష్పాలు,తులసీ దళాలు, వజ్రాభరణాలు, పట్టువస్త్రాలతో గోదాదేవిని విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు దిలీప్ కుమార్ పంతులు ఆండాల్ పూజను శాస్త్రోక్తంగా చేయించారు.

దాదాపు 200మందికి పైగా మహిళలు పాల్గొని సామూహికంగా గోదాదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. గోదాదేవి విష్ణుమూర్తిని స్తుతిస్తూ 30 పాసురాళ్లను వాసవీ మహిళా విభాగ్ సభ్యులు పారాయణం చేసి ఆథ్యాత్మిక శోభను తెచ్చారు లోక క్షేమాన్ని కాంక్షిస్తూ కోదై నాచియార్ వైభవ పూజను అత్యంత వైభవంగా నిర్వహించి గోదాదేవి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వాసవీ మహిళా విభాగ్ అధ్యక్షురాలు టి.లావణ్య, కార్యదర్శి
జి. సరళభాలాజీ, ట్రెజరర్ బి.సరళామనోహరన్,
వైస్ ప్రెసిడెంట్ పి.కల్పనబాబు, మరో 20 మంది సభ్యులతో చక్కగా నిర్వహించారు.కోధై నాచియార్ వైభవ పూజల్లో పాల్గొన్న భక్తులందరికి పసుపు కుంకుమ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

About Author